ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ 2024 నోటిఫికేష‌న్ విడుద‌ల..

ఎస్ఎస్‌సి సిహెచ్ఎస్ఎల్ 2024 నోటిఫికేష‌న్ విడుద‌ల‌య్యింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా మొత్తం 3712 ఉద్యోగాల‌కు భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడ‌దల‌య్యింది. వీటి ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు భ‌ర్తీ చేయ‌నున్నారు. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, రాజ్యాంగ సంస్థలు, ట్రైబ్యునళ్లు మొదలైనవాటిలో లోయర్‌ డివిజనల్‌ క్లర్క్, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్‌ పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) 2024 నోటిఫికేష‌న్ విడుదల చేసింది.

విద్యార్హ‌త‌లు

ఈ పోస్టుల‌కు అప్ల‌య్ చేయాల‌నుకునేవారు 12వ తరగతి/ ఇంటర్మీడియట్‌ అర్హత ఉన్నవారు ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవచ్చు. వీటికి ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు మే 7 చివ‌రితేదిగా నిర్ణ‌యించారు. అర్హ‌త, ఆస‌క్తి గ‌ల అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు. అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు అధికారిక వెబ్‌సైట్‌ను సంప్ర‌దించ‌గ‌ల‌రు. ఈ పోస్టులకు టైర్‌-1, టైర్‌-2 పరీక్షలు నిర్వహిస్తారు. మూడో ద‌శ‌లో కంప్యూటర్‌ టెస్ట్‌ లేదా టైపింగ్‌ టెస్ట్ ఉంటుంది. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. స‌ర్టిఫికేట్ వెరిఫికేష‌న్‌, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.ఈ పోస్టులకు సంబంధించి టైర్‌-1 జూన్‌-జులైలో నిర్వహిస్తారు. టైర్‌-2 పరీక్ష నిర్వహణ త్వరలో ప్రకటిస్తారు. ప‌రీక్ష‌లు ఆన్‌లైన్‌లోనే ఉంటాయి.

SSC CHSL 2024 Notification release

వయోప‌రిమితి

01-08-2024 నాటికి 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే 02-08-1997 నుంచి 01-08-2006 మధ్య జన్మించినవారు ఈ పోస్టులకు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు మ‌యోప‌రిమితి ఉంటుంది. ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు 10-15 ఏళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి.

వేత‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి...

ఎల్‌డీసీ, జేఎస్‌ఏ పోస్టులకు ఎంపికైన వారికి నెల‌కు రూ.19,900-63,200 ఉంటుంది.
డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులకు ఎంపికైన వారికి రూ.25,500-81,100 వేత‌నంగా ఉంటుంది.
డేటా ఎంట్రీ ఆపరేటర్‌ గ్రేడ్‌-ఏ పోస్టులకు ఎంపికైన వారికి రూ.29,200-92,300 వేత‌నంగా ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు ఫీజు వివ‌రాలు..

దరఖాస్తు ఫీజు : ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు ఓబీసి అభ్య‌ర్థులు రూ.109 చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఫీజు చెల్లించనవసరం లేదు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, రాజమహేంద్రవరం, వరంగల్, కాకినాడ, కరీంనగర్, కర్నూలు, నెల్లూరు, విజయనగరం, చీరాల తదితర ప్రదేశాల్లో పరీక్ష నిర్వహిస్తారు.

ముఖ్యమైన తేదీల వివ‌రాలివే..!

ఏప్రిల్‌ 8, 2024 తేదిని ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభ తేదీగా నిర్ణ‌యించారు.
మే 7, 2024 తేదీని ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీగా ప‌రిగ‌ణించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+