ఎస్ఎస్‌సి జీడీ కానిస్టేబుల్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..
కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్, రైఫిల్‌మ్యాన్ (జీడీ) నియామకాల రాత పరీక్ష ఫలితాలను తాజాగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్ధులు ఎస్ఎస్‌సి అధికారిక వెబ్‌సైట్‌లో తమ ఫలితాలను చెక్‌చేసుకోగలరు. ఫలితాలతో పాటు ప్రశ్నపత్రం, తుది కీని కూడా జులై 24వ తేదీ వరకు డౌన్‌లోడ్ చేసుకునేందుకు అభ్యర్థులకు అవకాశం కల్పించింది. ఎస్ఎస్‌సి జీడీ ప్రశ్నాపత్రం, తుది కీని చెక్‌చేసుకునేందుకు అభ్యర్థులు ఈ లింక్‌పై https://ssc.digialm.com/EForms/configuredHtml/2207/87626/login.html క్లిక్ చేయగలరు.
ఎస్ఎస్‌సి విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా దేశ వ్యాప్తంగా వివిధ సాయుధ బలగాల్లో మొత్తం 46,617 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో రాతపరీక్షలు జరిగిన విషయం విదితమే. ఈ రాతపరీక్షలు ఆన్‌లైన్‌లో నిర్వహించారు. ఇక వీటికి సంబందించిన ఫలితాలను ఎస్ఎస్‌సి తాజాగా విడుదల చేసింది. ఈ ఫలితాల్లో ఉత్తీర్ణులైన వారికి త్వరలోనే ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ నిర్వహిస్తారు.

ఇందులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు పిలుస్తారు. ఆ తర్వాత రిజర్వేషన్ పద్ధతిని అనుసరించి అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తారు. ఎస్ఎస్‌సి విడుదల చేసిన ఈ నోటిఫికేషన్‌లో భాగంగా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, సశస్త్ర సీమ బల్, సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్‌లో కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇక, వీటితోపాటు అస్సాం రైఫిల్స్ లో రైఫిల్‌మ్యాన్ పోస్టులు కూడా ఇందులోనే భర్తీ చేస్తారు.












Click it and Unblock the Notifications