SSC MTS 2024 : ప‌దోత‌ర‌గ‌తి అర్హ‌త‌తో 8,326 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌...

నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌... ప‌దో త‌ర‌గ‌తి అర్హ‌త‌తో 8,326 పోస్టుల‌కు ఎస్ఎస్‌సి (స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్‌) నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్‌లో భాగంగా మ‌ల్టీ టాస్కింగ్ స్టాఫ్, హ‌వ‌ల్దార్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. మొత్తం 8,326 పోస్టుల్లో 4,887 ఎమ్‌టిఎస్ పోస్టులు కాగా, 3,439 హ‌వాల్దార్ పోస్టులు ఉన్నాయి. అర్హ‌త, ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు జూలై 31 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

ఎస్‌ఎస్‌సీ 2024-25 ఎగ్జామ్‌ క్యాలెండర్‌ ప్రకారం కేంద్ర మంత్రిత్వ శాఖల్లో మల్టీ-టాస్కింగ్ స్టాఫ్, హవల్దార్ పోస్టుల భర్తీకి సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జాబ్‌ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మల్టీ-టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్ (గ్రూప్‌-సీ నాన్‌ గెజిటెడ్‌, నాన్‌-మినిస్టీరియల్‌), హవల్దార్ (గ్రూప్‌-సీ నాన్‌-గెజిటెడ్‌, నాన్‌ మినిస్టీరియల్‌) పోస్టులు భర్తీ చేయ‌నున్నారు. ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణులైన అభ్య‌ర్థులు ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు అర్హులు. జూలై 31 వ తేదీ వ‌ర‌కు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. గత సంవ‌త్స‌రం ఈ నోటిఫికేషన్‌ ద్వారా 1,558 ఖాళీలు భర్తీ అయిన సంగ‌తి తెలిసిందే.

SSC MTS 2024 Notification for 8 326 posts with 10th grade qualification

ఎంటీఎస్‌ ఖాళీలను సెషన్-1, 2 కంప్యూటర్ ఆధారిత పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తారు. హవల్దార్ ఖాళీలకయితే, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయ‌డం జ‌రుగుతుంది. ఈ పోస్టుల‌కు సంబంధించిన రాత‌ప‌రీక్ష అక్టోబర్‌- నవంబర్‌ నెలలో జ‌ర‌గ‌నున్నాయి. పూర్తి స్థాయి నోటిఫికేష‌న్ కోసం ఇత‌ర స‌మాచారం కోసం అభ్య‌ర్థులు ఎస్ఎస్‌సి అధికారిక వెబ్‌సైట్‌ను సంప్ర‌దించ‌గ‌ల‌రు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+