Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణ ప్రభుత్వ స్టాఫ్ నర్సు ఫలితాలు విడుదల

తెలంగాణ రాష్ట్రంలో స్టాఫ్ నర్సు (staff nurse) ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పరీక్ష ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. మొత్తం 7094 పోస్టులకు ఆగస్టు 2న కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించగా.. దాదాపు 40 వేల మంది రాశారు. తాజాగా, ఈ పరీక్ష తుది కీతోపాటు ఫలితాలను విడుదల చేసినట్లు టీఎస్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (MHSRB) ప్రకటించింది.

తమ అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థుల మార్కులు, ఇతర వివరాలను అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. అభ్యర్థులు పొందిన పాయింట్లపై అభ్యంతరాలను సోమవారం సాయంత్రం 5.30 గంటల నుంచి డిసెంబర్ 20లోగా ఆన్‌లైన్‌లో తెలపవచ్చని సూచించింది.

telangana government staff nurse posts results 2023 released

అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని ప్రాథమిక మెరిట్ లిస్ట్ విడుదల చేయనున్నట్లు బోర్డ్ వెల్లడించింది. ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ ఆధారంగా అభ్యర్థులను సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కు పిలుస్తామని పేర్కొంది. ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం ఫైనల్ మెరిట్ లిస్ట్/ సెలక్షన్ లిస్టును విడుదల చేయనున్నట్లు టీఎస్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు వెల్లడించింది.

స్టాఫ్ నర్సు ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తెలంగాణ గురుకుల పాఠశాల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో 2024-25 విద్యాసంవత్సరంలో ఐదో తరగతిలో ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సోమవారం నుంచి మొదలు కానుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ సెక్రటరీ, వీటీజీ సెట్‌ కన్వీనర్‌ నవీన్‌ నికోలస్‌ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.

తెలంగాణలోని టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌, టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎల్‌, ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌, టీఆర్‌ఈఐఎస్‌ గురుకులాల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గానూ ఐదో తరగతి ఇంగ్లిషు మీడియంలో ప్రవేశాలకు సంబంధించి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 2023-24విద్యాసంవత్సరంలో నాల్గో తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులని స్పష్టం చేశారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీగా జనవరి 6ను నిర్ణయించారు. దరఖాస్తు రుసుము కింద ప్రతి ఒక్కరూ రూ.100లు చెల్లించాల్సి ఉంటుంది. తెలంగాణ గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశ పరీక్ష-2024, రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు. సంబంధిత జిల్లాల్లోని ఏదైనా ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో నాలుగో తరగతి 2023-24 విద్యా సంవత్సరంలో చదివి ఉండాలి.

జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి సంబంధిత జిల్లాలోని పాఠశాలల్లో చదువుతూ ఉండాలి. విద్యార్ధుల వయసుకు సంబంధించి ఓసీ, బీసీ, బీసీ విద్యార్థులు 9 నుంచి 11 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 9 నుంచి 13 ఏళ్ల మధ్య ఉండాలి. విద్యార్ధుల తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతంలో రూ.1.50,000, పట్టణ ప్రాంతంలో రూ.2,00,000 మించకుండా ఉండాలి.

జనవరి 6లోగా దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించాలన్నారు. ఫిబ్రవరి11న రాతపరీక్ష నిర్వహించి, మెరిట్‌, రిజర్వేషన్ల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేయనున్నట్లు వివరించారు. ఇతర వివరాలకు 1800 425 45678 టోల్‌ఫ్రీ నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+