తెలంగాణలో త్వరలో గ్రూప్ 4 నోటిఫికేషన్: మంత్రి హరీశ్ రావు, డీఎస్సీకి ఉచిత కోచింగ్
హైదరాబాద్: నిరుద్యోగ యువకులకు ఆర్థిక మంత్రి హరీశ్ రావు గుడ్‌న్యూస్ చెప్పారు. త్వరలోనే గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రాబోతుందని తెలిపారు. సిద్దిపేట జిల్లా పొన్నాలలో టెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులతో సమావేశమయ్యారు మంత్రి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డీఎస్సీ నోటిఫికేషన్ రాకముందే ఉచితంగా కోచింగ్ ఇప్పిస్తామని చెప్పారు.
తొందరలోనే ఉచిత డీఎస్సీ లాంగ్ టర్మ్ కోచింగ్ సెంటర్ ప్రారంభిస్తామని, ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకుని ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు.
తెలంగాణలో ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే.. కేంద్రం మాత్రం ఉద్యోగాలను భర్తీ చేయడం లేదని హరీశ్ రావు మండిపడ్డారు. బీజేపీ నేతలు మాటలకే పరిమితమని అన్నారు. యువతను మోసం చేసేందుకే అగ్నిపథ్ పథకమని విమర్శించారు హరీశ్ రావు.

రాష్ట్రంలో టెట్ ఉత్తీర్థత శాతం 32 శాతం ఉంటే.. సీఎం కేసీఆర్ ఉచిత కోచింగ్ సెటర్లలో 82 శాతం మంది ఉత్తీర్ణత సాధించడం గొప్ప విషయమని అన్నారు.
టెట్ ఉత్తీర్ణత అయిన విద్యార్థులందరూ ఉద్యోగాలు సాధించినప్పుడే ఉచిత కోచింగ్ సెంటర్‌కు సార్ధకత లభిస్తుందన్నారు మంత్రి హరీశ్ రావు. కేంద్రంలో 16.50 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్న మంత్రి... ఇప్పటివరకు ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రంలో ఒక లక్ష 50 వేల ఉద్యోగాలు ఖాళీ ఉంటే... ఇప్పటికే లక్ష 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు.ఫేక్‌న్యూస్‌లు క్రియేట్ చేసి గ్లోబల్స్ ప్రచారం చేయడంలో బీజేపీ వాళ్లను మించిన వాళ్లు లేరని.. బీజేపీ విష ప్రచారాలను ఎవరు నమ్మవద్దన్నారు మంత్రి హరీశ్ రావు. 8 సంవత్సరాల బీజేపీ పాలనలో ప్రభుత్వ సంస్థలను అమ్మడం.. తప్ప కొత్త సంస్థలను ఏర్పాటు చేసింది ఏమీ లేదని ఆరోపించారు.












Click it and Unblock the Notifications