తెలంగాణ గ్రూప్ 4 ఫలితాలు విడుదల
తెలంగాణలో గ్రూప్ 4 పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) శుభవార్త చెప్పింది. శుక్రవారం టీఎస్‌పీఎస్సీ గ్రూప్-4 ఫలితాలను వెల్లడించింది. అభ్యర్థుల ర్యాంకుల జాబితాను వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. అభ్యర్థులు వెబ్‌సైట్‌లో ర్యాంకులు చూసుకోవాలని కమిషన్ సూచించింది.
గత సంవత్సరం జులై 1న టీఎస్పీఎస్సీ గ్రూప్- 4 పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో ఉన్న గ్రూప్-4 ఖాళీలను భర్తీ చేయడానికి 2022 డిసెంబరులో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, జూనియర్ ఆడిటర్, వార్డు ఆఫీసర్ వంటి తదితర పోస్టులు ఉన్నాయి.

టీఎస్పీఎస్సీ మొత్తం 8,180 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేయగా.. గతేడాది జులై 1న పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షను రికార్డు స్థాయిలో 9.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 7 లక్షల 60 వేల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. గ్రూప్- 4 పరీక్షకు సంబంధించిన తుది కీని టీఎస్పీఎస్సీ గతేడాది అక్టోబరులో విడుదల చేసింది. ఫలితాలు రావడంతో నియామకాలు కూడా త్వరలోనే జరిగే అవకాశం ఉంది.
తెలంగాణ నిరుద్యోగులు, గ్రూప్ 1 అభ్యర్థులకు గుడ్‌న్యూస్
తెలంగాణ సర్కారు నిరుద్యోగులకు శుభవార్త. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్-1 నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. ఇందుకు సంబంధించి కసరత్తు చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) తెలిపారు. అయితే, వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచి గ్రూప్- 1 నిర్వహిస్తామని అసెంబ్లీ సాక్షిగా సీఎం ప్రకటించారు.
కొన్ని నిబంధనల వల్ల టీఎస్‌పీఎస్‌సీ(TSPSC) ప్రక్షాళన ఆలస్యం అయ్యిందని సీఎం రేవంత్ తెలిపారు. పోలీసు ఉద్యోగాల కోసం యువత ఎంతోకాలం నిరీక్షించారన్న రేవంత్.. 15 వేల ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేస్తామని చెప్పారు. నలుగురి ఉద్యోగాలు పోయిన దుఃఖంలో 2 లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు. జీరాక్స్ సెంటర్లలో ప్రశ్నపత్రాలు విక్రయించి ఉద్యోగాలు భర్తీ చేసేవాళ్లం కాదని రేవంత్ రెడ్డి గత సర్కారుకు చురకలంటించారు.












Click it and Unblock the Notifications