తెలంగాణ గురుకుల రిక్రూట్‌మెంట్: ఆగస్టు 1 నుంచి పరీక్షలు

హైదరాబాద్: తెలంగాణలోని గురుకులాల్లో బోధనా సిబ్బంది, ఇతర ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు సంబంధించిన గురుకుల విద్యాలయాల సంస్థ కీలక ప్రకటన వెలువరించింది. ఈ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పరీక్ష తేదీలను ఖరారు చేసింది. ఆగస్టు 1 నుంచి 23 తేదీ వరకు గురుకుల నియామక పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఈ పరీక్షలన్నింటినీ ఆన్‌లైన్‌లోనే జరుగుతాయని తెలిపారు. 9వేలకుపైగా పోస్టులకు గానూ గురుకుల నియామక బోర్డు 9 నోటిఫికేషన్లను విడివిడిగా విడుదల చేయగా.. 2.63 లక్షల మందికిపైగా దరఖాస్తులు వచ్చాయి. అయితే, ఈ పరీక్షల షెడ్యూల్‌ను ఒకట్రెండు రోజుల్లో వెల్లడించనున్నట్లు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్స్ రిక్రూట్‌మెంట్ బోర్డ్(TREIRB) కన్వీనర్ డాక్టర్ మల్లయ్య బట్టు తెలిపారు.

 Telangana gurukul recruitment: exams held from August 1st.

పోస్టుల వివరాలను గమనించినట్లయితే..

డిగ్రీ లెక్చరర్ పీడీ, లైబ్రేరియన్: 868
జూనియర్ లెక్చరర్, లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్: 2008
పోస్ట్ గ్రాడ్యూయేట్ టీచర్లు(పీజీటీ): 1276
ట్రైన్డ్ గ్రాడ్యూయేట్ టీచర్లు(టీజీటీ): 4020
లైబ్రేరియన్ స్కూల్: 434
ఫిజికల్ డైరెక్టర్స్ ఇన్ స్కూల్: 275
డ్రాయింగ్ టీచర్లు, ఆర్ట్ టీచర్లు: 134
క్రాఫ్ట్ ఇన్ స్ట్రక్టర్, క్రాఫ్ట్ టీచర్లు: 92
మ్యూజిక్ టీచర్లు: 124

యాదాద్రి భువనగిరి జిల్లాలో పలు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్

యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా శిశు దివ్యాంగుల, వయోవృధ్ధుల సంక్షేమ శాఖ పలు ఉద్యోగాలను ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన పాజెక్టు కో ఆర్డినేటర్, కౌన్సిలర్, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ సూపర్‌ వైజర్, కేస్‌ వర్కర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

అర్హతలు:
ప్రాజెక్టు కోఆర్డినేటర్‌ పోస్టులకు సోషల్‌ వర్క్‌ స్పెషలైజేషన్‌లో పీజీ, డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. కనీసం రెండేళ్ల పని అనుభవం ఉండాలి.

కౌన్సిలర్‌ పోస్టులకు సోషల్‌ వర్క్‌లో గ్రాడ్యుయేషన్‌, పీజీ, డిప్లొమాలో ఉత్తీర్ణతతోపాటు రెండేళ్ల అనుభవం ఉండాలి.

చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ సూపర్‌వైజర్‌ పోస్టులకు తప్పనిసరిగా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత ఉండాలి. కనీసం ఏడాది అనుభవం ఉండాలి.
కేస్‌ వర్కర్‌ పోస్టులకు ఇంటర్‌ ఉత్తీర్ణత ఉంటే చాలు.

వయో పరిమితి:
అన్ని పోస్టులకు వయసు 21 నుంచి 35 సంవత్సరాలలోపు ఉండాలి.

షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

అర్హత సాధించిన వారికి నెలకు రూ.15,600 నుంచి రూ.28,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ విధానంలో జూన్‌ 17, 2022వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు కింది అడ్రస్‌లో దరఖాస్తులు సమర్పించాలి.

చిరునామా:
జిల్లా సంక్షేమశాఖ, బ్లాక్‌ నం: జీ-01, జిల్లా కలెక్టర్‌ కార్యాలయం, రాయగిరి, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+