గురుకులాల్లో 9వేల పోస్టుల భర్తీ: అందుబాటులోకి ఓటీఆర్ రిజిస్ట్రేషన్
హైదరాబాద్: తెలంగాణలోని గురుకుల విద్యాలయాల్లో బోధన పోస్టుల భర్తీకి వన్ టైమ్ రిజిస్ట్రేషన్(OTR) బుధవారం అందుబాటులోకి వచ్చింది. ఇటీవల గురుకులాల్లో 9,231 పోస్టుల భర్తీకి 9 ఉద్యోగ ప్రకటనలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు కేటగిరీలవారీగా ఏప్రిల్ 17 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రాంరభం కానుంది.
కాగా, ఓటీఆర్ నమోదు చేస్తేనే గురుకుల పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత లభిస్తుంది. ఈ మేరకు ఓటీఆర్ నమోదుకు సంబంధించిన వెబ్‌లింక్‌ను గురుకుల నియాయమక బోర్డు వెబ్‌సైట్ https://treirb.telangana.gov.in/లో అందుబాటులో ఉంచింది.

ఓటీఆర్ నమోదు కోసం తొలుత ఆధార్ నెంబర్ నమోదు చేయాలి. తర్వాత వ్యక్తిగత వివరాలు పూర్తి చేయాల్సి ఉంటుంది. రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల ప్రకారం 1 నుంచి 7 వరకు చదవిని జిల్లాను నమోద చేయాలి. దీంతో ఓటీఆర్ పూర్తవుతుంది.
అనంతరం నోటిఫికేషన్ల వారీగా అర్హత మేరకు దరఖాస్తు చేసుకునేందుకు వీలుంటుంది. ఓటీఆర్ నమోదు తర్వాత యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ సహాయంతో లాగిన్ అయి.. అర్హత కలిగిన పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలి. ఇక పరీక్ష ఫీజు చెల్లించి, మిగితా వివరాలు నమోదు చేయడం ద్వారా దరఖాస్తు పూర్తవుతుంది.












Click it and Unblock the Notifications