తెలంగాణ గురుకుల టీజీటీ ఫలితాలు విడుదల
హైదరాబాద్: గురుకుల ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల నిరీక్షణకు తెరపడింది. తెలంగాణ సంక్షేమ గురుకులాల్లో టీజీటీ ఉద్యోగ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఆదివారం సాయంత్రం ఫలితాలను గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://treirb.cgg.gov.in/home లో అందుబాటులో ఉంచింది.
గురుకులాల్లో 4020 పోస్టులు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(TGT) పోస్టులకు గత ఆగస్టులో రాత పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షల్లో మెరిట్ సాధించిన అభ్యర్థులను 1-2 నిష్పత్తిలో ధృవీకరణ పత్రాల పరిశీలనకు ఎంపిక చేసింది. ఈ మేరకు ప్రొవిజినల్ సెలక్షన్ జాబితాను విడుదల చేసింది.

ప్రొవిజినల్ జాబితాలో ఉన్న హాల్ టికెట్ నెంబర్ కలిగిన అభ్యర్థులకు ఫిబ్రవరి 27, 28 తేదీల్లో హైదరాబాద్‌లో ఈ కింది తేదీల్లో ధృవీకరణ పత్రాల పరిశీలనకు హాజరుకావాలని సూచించింది.
నిమ్స్‌లో స్టాఫ్ నర్సు పోస్టుల తుది జాబితా విడుదల
కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సు పోస్టుల తుది జాబితాను నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(NIMS) ఆస్పత్రి విడుదల చేసింది. నియామకం కోసం జనవరిలో నోటిఫికేషన్ ఇచ్చిన నిమ్స్.. మొత్తం 300 మందిని ఎంపిక చేసింది. ఈ జాబితాలో ఉన్న అభ్యర్థులు మార్చి 4లోపు నిమ్స్‌లోని పాత ఓపీ బ్లాక్‌లోని తొలి అంతస్తులో హెచ్ఆర్ 1 సెక్షన్ లో రిపోర్టు చేయాలని ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్ తెలిపారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను నిమ్స్ వెబ్‌సైట్ http://www.nims.edu.in/ అందుబాటులో ఉంచింది.












Click it and Unblock the Notifications