తెలంగాణ గురుకుల జూనియర్ లెక్చరర్ పోస్టుల ఫలితాలు విడుదల: ఇలా తెలుసుకోండి
తెలంగాణలోని సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో 1924 జూనియర్ లెక్చరర్ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఈ ఫలితాలను గురుకుల నియామక బోర్డు విడుదల చేసింది. డిగ్రీ కళాశాలల్లో 793 లెక్చరర్ ఉద్యోగ రాత పరీక్ష ఫలితాలను బుధవారం విడులైన విషయం తెలిసిందే.
తాజాగా, జేఎల్ పోస్టులకు ఎంపికైన వారి ప్రాథమిక జాబితాలను సబ్జెక్టుల వారీగా అధికారిక వెబ్‌సైట్ https://treirb.cgg.gov.in/home లో అందుబాటులో ఉంచారు. జేఎల్ రాత పరీక్షలు గత ఆగస్టు 3 నుంచి 23వ తేదీ వరకు జరిగిన విషయం తెలిసిందే. దివ్యాంగుల కేటగిరీ ఫలితాలు త్వరలోనే ప్రకటించనున్నారు. సబ్జెక్టులవారీగా పోస్టులకు ఎంపికైన వారి జాబితాను చూడవచ్చు.

జేఎల్(మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) పోస్టులకు ఎంపికైన వారి జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి
జేఎల్ (తెలుగు, హిందీ, ఉర్దూ) పోస్టులకు ఎంపికైన వారి జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి
జేఎల్ (ఇంగ్లీష్) పోస్టులకు ఎంపికైనా వారి జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కాగా, జేఎల్ రాత పరీక్షలు గతేడాది ఆగస్టు 3 నుంచి 23వ తేదీ వరకు జరిగిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో ఖాళీల భర్తీకి గురుకుల బోర్డు పెద్దసంఖ్యలో పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేసింది. 9,210 పోస్టుల భర్తీకి నిర్వహించిన కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహించింది. ఈ పోస్టులకు రాష్ట్రవ్యాప్తంగా 2.66 లక్షల మంది దరఖాస్తు చేయగా, 17 జిల్లాల్లోని 104 కేంద్రాల్లో రోజుకు మూడు షిప్టుల చొప్పున రాత పరీక్షలను గురుకుల నియామక బోర్డు నిర్వహించింది. వాటికి సగటున 75.68 శాతం మంది హాజరయ్యారు.












Click it and Unblock the Notifications