తెలుగులో కూడా: జేఎల్ పరీక్షపై హైకోర్టు కీలక ఆదేశాలు
హైదరాబాద్: జూనియర్ లెక్చర్ పరీక్ష ప్రశ్నపత్రాన్ని ఇంగ్లీష్‌లోనే ఇవ్వాలన్న తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టింది. పేపర్-2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీ నిమిత్తం గత డిసెంబర్ 9న జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం నిర్వహించే పరీక్షలకు ప్రశ్నపత్రాలను ఇంగ్లీష్‌లోనే ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఆదిలాబాద్‌కు చెందిన టీ విజయ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఇష్టానుసారంగా పరీక్షలు నిర్వహించడం సరికాదని వ్యాఖ్యానించింది.

జూనియర్ లెక్చరర్ పేపర్-2 ప్రశ్నపత్రం ఇంగ్లీష్, తెలుగులో ఇవ్వాలని టీఎస్ పీఎస్సీని హైకోర్టు సోమవారం ఆదేశించింది. కాగా, ఇటీవల టీఎస్ పీఎస్సీ జేఎల్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా 1392 పోస్టులను భర్తీ చేయనున్నారు.
టీఎస్ఆర్జేసీ సెట్ నోటిఫికేషన్ విడుదల, మే 6న ప్రవేశ పరీక్ష
హైదరాబాద్: తెలంగాణలోని 35 జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు గురుకు ల విద్యాలయాల సంస్థ నోటిఫికేషన్ జారీ చేసింది. మార్చి 31 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రకటనను విడుదల చేసింది.
tsrjdc.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించింది. మే 6న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొంది. రాష్ట్రంలోని 35 గురుకులాల్లో ఇంటర్ ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం టీఎస్ ఆర్జేసీ సెట్ ను నిర్వహిస్తారు.
దరఖాస్తు రుసుము రూ. 200గా ఉంది. దరఖాస్తులు సమర్పించిన అభ్యర్థులు మే 1 నుంచి 5వ తేదీ వరకు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మే 6న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరగనుంది.












Click it and Unblock the Notifications