ఏపీపీఎస్సీ గ్రూప్-1 రిక్రూట్‌మెంట్: రేపే చివరి తేదీ, వెంటనే అప్లై చేయండి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) గ్రూప్ 1 పోస్టులకు వెంటనే అప్లై చేయండి. ఎందుకంటే రేపే(నవంబర్ 5) చివరి తేదీ. శనివారంతో దరఖాస్తుల ప్రక్రియ ముగియనుంది. దీంతో నోటిఫికేషన్ ప్రకారం రేపటిలోగా ఆన్ లైన్ దరఖాస్తులు చేసుకోవాలని కమిషన్ సూచించింది.
ఆన్‌లైన్ దరఖాస్తులు నవంబర్ 2వ తేదీ ముగియనుండగా.. తాజాగా అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు నవంబర్ 5 వరకు గడువు తేదీని పొడిగిస్తున్నట్లు ఏపీపీఎస్సీ పేర్కొంది. మొత్తం 92 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఈ రిక్రూట్‌మెంట్ జరుగుతోంది.
విద్యార్హత:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయో పరిమితి:
అభ్యర్థుల వయస్సు పోస్టులను బట్టి 18-42 ఏళ్ల మధ్య ఉండాలి.
ఫీజు వివరాలు:
జనరల్ అభ్యర్థులు రూ. 370, ఎస్సీ/ఎస్టీ/బీసీ/పీహెచ్/ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ. 120 చెల్లించాల్సి ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ:
రాత పరీక్ష(ప్రిలిమ్స్, మెయిన్స్), ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
ప్రిలిమినరీ రాత పరీక్ష డిసెంబర్ 18, 2022న నిర్వహించనున్నారు.
మెయిన్స్ రాత పరీక్ష మార్చి 2023లో ఉంటుంది.
జీతం వివరాలు:
ఎంపికైన వారికి నెలకు రూ. 554,060 నుంచి రూ. 1,51,370 వరకు ఉంటుంది.
మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి












Click it and Unblock the Notifications