తెలంగాణలో ఎస్ఐ, ఏఎస్ఐ పరీక్ష తేదీ ఖరారు
టెక్నికల్ ఎస్ఐ, ఏఎస్ఐ(ఎఫ్‌పీబీ) పోస్టులకు మెయిన్స్ ఎగ్జామ్ తేదీని టీఎస్ఎల్పీఆర్బీ ప్రకటించింది.
హైదరాబాద్: తెలంగాణలో పోలీసు అభ్యర్థులకు కీలక అప్‌డేట్ వచ్చింది.ఎస్ఐ, ఏఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఫిజికల్ పరీక్షలను పూర్తి చేసిన తెలంగాణ పోలీస్ ఉద్యోగాల నియామక బోర్డ్ (టీఎస్ఎల్పీఆర్బీ).. తాజాగా టెక్నికల్ ఎస్ఐ, ఏఎస్ఐ(ఎఫ్‌పీబీ) పోస్టులకు మెయిన్స్ ఎగ్జామ్ తేదీలను ప్రకటించింది.
మార్చి 11న ఎస్‌సీడీ ఎస్ఐ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ ఆర్గనైజేషన్) అభ్యర్థులకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు.. ఏఎస్ఐ(ఎఫ్‌పీబీ) అభ్యర్థులకు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు తుది పరీక్షను నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు హైదరాబాద్‌లోని కేంద్రాల్లో నిర్వహించనున్నారు.

అర్హులైన అభ్యర్థులు మార్చి 8వ తేదీ అర్ధరావ్రి వరకు టీఎస్ ఎల్ పీఆర్బీ వెబ్‌సైట్ https://www.tslprb.in లో హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసేటప్పుడు సమస్య తల
హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసేటప్పుడు ఏదైనా సమస్య తలెత్తినట్లయితే [email protected] కు మెయిల్ చేయవచ్చు లేదా 9393711110, 9391005006 నంబర్లకు ఫోన్ చేసి వివరాలు పొందవచ్చన్నారు. మిగిలిన రెండు పరీక్షలకు సంబంధించిన తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని టీఎస్ ఎల్ఆర్బీ ప్రకటించింది.












Click it and Unblock the Notifications