తెలంగాణ టెట్ ప్రాథమిక కీ విడుదల
హైదరాబాద్: తెలంగాణలో జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) ప్రాథమిక కీ విడుదలైంది. తెలంగాణ టెట్ పేపర్-1, 2 'కీ'లను బుధవారం విడుదల చేశారు. సెప్టెంబర్ 23 వరకు ఆన్‌లైన్‌లో అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు టెట్ కన్వీనర్ పేర్కొన్నారు. tstet.cgg.gov.inలో ప్రాథమిక కీని అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. సెప్టెంబర్ 15న విద్యాశాఖ రాష్ట్రవ్యాప్తంగా 2,052 కేంద్రాల్లో ఉపాధ్యాయ అర్హత పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. పరీక్ష కోసం దాదాపు 4,78,055 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో పేపర్-1కు 2,69,557 మంది, పేపర్-2కు 2,08,498 మంది చేసుకున్నారు.

పేపర్-1 పరీక్షను 2,26,744 (84.12శాతం) రాశారు. బీఈడీ విద్యార్థులకే అర్హత ఉన్న పేపర్-2 పరీక్షను 91.11 శాతం మంది రాశారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1 పరీక్ష జరుగగా.. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పేపర్-2 రాతపరీక్ష నిర్వహించింది.
గత శుక్రవారం టెట్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. పేపర్-1కు 2 లక్షల 69 వేల 557 మంది దరఖాస్తు చేయగా.. 1139 కేంద్రాలు ఏర్పాటు చేశారు. పేపర్ టూ 2 లక్షల 8 వేల 498 రాయనుండగా.. 913 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను ఎగ్జామ్ హాల్లోకి అనుమతించలేదు.
తాజాగా టెట్‌కు సంబంధించి ప్రైమరీ కీని విడుదల చేసింది. అభ్యంతరాలను స్వీకరించిన అనంతరం ఫైనల్ కీని విడుదల చేయనుంది. సెప్టెంబర్ 27న టెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. కాగా, ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమితులు కావాలంటే టెట్‌లో క్వాలిఫై కావడం తప్పనిసరి అని తెలిసిందే.












Click it and Unblock the Notifications