పీహెచ్‌డీ చేయనివారికి బిగ్ రిలీఫ్: అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీపై యూజీసీ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(UGC) కీలక నిర్ణయం ప్రకటించింది.ఉన్నత విద్యా సంస్థల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగా లభర్తీకి పీహెచ్‌డీ తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. ఆ ఉద్యోగాల మార్గదర్శకాల్లోని పీహెచ్‌డీ నిబంధనను తొలగిస్తున్నట్లు యూజీసీ ప్రకటించింది. ఈ నిర్ణయం జులై 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్టు యూజీసీ వెల్లడించింది.
అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలకు ఆయా అభ్యర్థులు నెట్, సెట్, స్లెట్ పరీక్షల్లో అర్హత సాధిస్తే చాలని తెలిపింది. దేశంలోని యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు పోటీ పడాలంటే పీహెచ్‌డీని తప్పనిసరి చేస్తూ 2018లో యూజీసీ నిబంధనలు జారీ చేసింది. దీంతో ఆ నిబంధనలు దేశ వ్యాప్తంగా 2018, జులై 1 నుంచి అమల్లోకి వచ్చాయి.

తాజాగా, ఆ నిబంధనలను యూజీసీ సవరించింది. ఇకపై అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే పీహెచ్‌డీ తప్పనిసరి కాదని యూజీసీ స్పష్టం చేసింది. బోధన పట్ల ఆసక్తి కగిలి ఉండి, పీహెచ్‌డీ డిగ్రీ లేని ఎంతో మంది అభ్యర్థులకు ఈ నిర్ణయం ఎంతో ఉపశమనం కలిగించినట్లయింది.
Is Ph.D. Mandatory for the post of Assistant Professor in Universities and Colleges? What UGC says? Can institutions raise the shortlisting criteria? pic.twitter.com/tZsh98ZQ1c
— UGC INDIA (@ugc_india) July 5, 2023
సవరించిన యూజీసీ అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత మార్గదర్శకాలు విశ్వవిద్యాలయాలు, కళాశాలలో ఉపాధ్యాయులు, ఇతర విద్యా సిబ్బంది కనీస అర్హతల కోసం జారీ చేసింది. సవరించిన మార్గదర్శకాల ప్రకారం NET/SET/SLET అన్ని ఉన్నత విద్యా సంస్థలకు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ప్రత్యక్ష నియామకానికి కనీస ప్రమాణాలుగా నిర్ణయించింది.
యూజీసీ చీఫ్ సవరించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ మార్గదర్శకాలను మార్చిలో మౌఖికంగా ప్రకటించారు. దీంతో అధికారిక నోటిఫికేషన్ కోసం లక్షలాది మంది ఆశావాహులు ఎదుచూశారు. తాజాగా, యూజీసీ సవరించిన మార్గదర్శకాలను జారీ చేసింది. తాజా నిర్ణయం జులై 1, 2023 నుంచి అమల్లోకి వచ్చింది.












Click it and Unblock the Notifications