యూజీసీ- నెట్ జూన్ 2024 దరఖాస్తు గడువు పొడిగింపు..
యూజీసీ- నెట్ జూన్ 2024 దరఖాస్తు గడువును పొడిగించారు. ఈ మేరకు యూజీసీ నెట్ పరీక్షను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. యూజీసీ - నెట్ జూన్ 2024 అప్లయ్ చేసుకునేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు గడువును మే 15వ తేదీ వరకు పొడిగించినట్లు యూజీసీ చైర్మన్ తెలిపారు. కావున, ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు యూజీసీ అధికారిక వెబ్సైట్ ugcnet.nta.ac.in ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.
జూనియర్ రిసెర్చి ఫెలోషిప్ అవార్డు, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీపడేందుకు, పీహెచ్‌డీ ప్రవేశాలకు ఈ పరీక్షను నిర్వహిస్తారు. యూజీసి నెట్ 2024 పరీక్ష జూన్ 18న నిర్వహించనున్నారు. ఈ పరీక్షను ఏటా రెండు సార్లు నిర్వహిస్తారు. మొత్తం 83 సబ్జెక్టులకు ఈ పరీక్ష ఉంటుంది. పరీక్ష వ్యవధి 180 నిమిషాలు (3 గంటలు). పరీక్షను ఓఎంఆర్ (పెన్ అండ్ పేపర్) విధానంలో నిర్వహించనున్నారు. యూజీసి నెట్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లలో ఆబ్జెక్టివ్ తరహా, మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. రెండు పేపర్స్ మధ్య ఎలాంటి బ్రేక్ ఉండదు.

ఎన్‌టిఎ (నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ) నిర్వహించే యూజీసీ - నెట్ జూన్ 2024 ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 15, 2024 తో ముగుస్తుంది. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు మే 16, 2024 రాత్రి 11:59 గంటల వరకు క్రెడిట్ కార్డు/ డెబిట్ కార్డు/ నెట్ బ్యాంకింగ్/ యూపీఐ ద్వారా దరఖాస్తు రుసుమును చెల్లించవచ్చు. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలనుకున్న అభ్యర్థులు 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ఓబీసీ- ఎన్‌సీఎల్/ ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ థర్డ్ జెండర్ కేటగిరీ అభ్యర్థులకు 50% మార్కులు అవసరం.
వయసు : అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు ఎటువంటి గరిష్ఠ వయోపరిమితి ఉండదు. జేఆర్‌ఎఫ్‌కు 01.06.2024 నాటికి 30 ఏళ్లు మించకుండా ఉండాలి.
ఫీజు వివరాలు : జనరల్/ అన్‌రిజర్వ్‌డ్ అభ్యర్థులయితే రూ.1150 చెల్లించాలి. జనరల్- ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ- ఎన్‌సీఎల్ అభ్యర్థులయితే రూ.600 చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్ జెండర్‌లకు రూ.325గా నిర్ణయించారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications