UPSC: సివిల్స్ ఫలితాలు విడుదల, టాపర్స్ లిస్ట్ ఇదే!
భారతదేశపు అత్యంత ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీసెస్ పరీక్ష (UPSC CSE 2025) తుది ఫలితాలు నేడు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా లక్షలాది మంది పోటీపడిన ఈ పరీక్షలో చివరకు అనుజ్ అగ్నిహోత్రి ఆలిండియా మొదటి ర్యాంక్ (AIR 1) సాధించి విజేతగా నిలిచారు. మొత్తం 1087 ఖాళీలకు గాను, యూపీఎస్‌సీ ప్రస్తుతానికి 958 మంది అభ్యర్థులను వివిధ సర్వీసులకు సిఫార్సు చేస్తూ జాబితాను ప్రకటించింది.
జాతీయ స్థాయిలో సత్తా చాటిన టాప్ 10 అభ్యర్థులలో అనుజ్ అగ్నిహోత్రి మొదటి స్థానంలో నిలవగా, రాజేశ్వరి సువే రెండో ర్యాంక్, ఆకాంష్ ధుల్ మూడో ర్యాంక్ సాధించారు. 2025 ఆగస్టులో జరిగిన రాత పరీక్షలు (Mains), ఆ తర్వాత 2026 ఫిబ్రవరిలో నిర్వహించిన పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ) ఆధారంగా ఈ తుది ఎంపిక జరిగింది. ఎంపికైన వారు ఐఏఎస్ (IAS), ఐపీఎస్ (IPS), ఐఎఫ్ఎస్ (IFS) తో పాటు కేంద్ర ప్రభుత్వంలోని గ్రూప్ 'ఎ', గ్రూప్ 'బి' విభాగాల్లో ఉన్నత పదవులను అలంకరించనున్నారు.

UPSC టాప్ 20 అభ్యర్థుల వివరాలు..
- 1. అనుజ్ అగ్నిహోత్రి (రోల్ నెం. 1131589)
- 2. రాజేశ్వరి సువే (4000040)
- 3. ఆకాంష్ ధుల్ (3512521),
- 4. రాఘవ్ ఝున్‌ఝున్‌వాలా (0834732)
- 5. ఈషాన్ భట్నాగర్ (0409847)
- 6. జినియా అరోరా (6410067)
- 7. ఏ.ఆర్. రాజా మోహైదీన్ (0818306)
- 8. పక్షల్ సెక్రటరీ (0843487)
- 9. ఆస్థ జైన్ (0831647)
- 10. ఉజ్వల్ ప్రియాంక్ (1523945)
- 11. యశస్వి రాజ్ వర్ధన్ (1512091)
- 12. అక్షిత్ భరద్వాజ్ (0840280)
- 13. ఆన్య శర్మ (7813999)
- 14. సురభి యాదవ్ (5402316)
- 15. సిమ్రన్‌దీప్ కౌర్ (3507500)
- 16. మోనికా శ్రీవాస్తవ (0867445)
- 17. చిత్వాన్ జైన్ (0829589)
- 18. శృతి ఆర్ (5604518)
- 19. నిషార్ దిశాంత్ అమృతలాల్ (0105602)
- 20. రవి రాజ్ (6630448)
UPSC తెలుగు తేజాలు..
సివిల్స్ ఫలితాల్లో పలువురు తెలుగు విద్యార్థులు సత్తా చాటారు.
- 55వ ర్యాంకు - సృజన
- 193వ ర్యాంకు- డీఎస్‌కే ప్రచేత్ ,
- 259వ ర్యాంకు- ఎస్ వర్షిత్ రెడ్డి,
- 297వ ర్యాంకు- ఎం.పవన్‌కుమార్ రెడ్డి,
- 541వ ర్యాంకు- వెలిమినేటి విక్రమసింహారెడ్డి ,
- 573వ ర్యాంకు- గుమ్మల శ్వేత,
- 640వ ర్యాంకు-పల్లి ప్రమోద్ విష్ణు,
- 682వ ర్యాంకు-గుమ్మల విజయసింహారెడ్డి,
- 738వ ర్యాంకు-పోతుపురెడ్డి భార్గవ్,
- 748వ ర్యాంకు- పుడారి రాహుల్,
- 768వ ర్యాంకు- కుమ్మరి శ్రవణ్‌కుమార్,
- 786వ ర్యాంకు-అనిరుధ్ కత్తిమాని,
- 806వ ర్యాంకు-కోరపోతుల శ్రీకర్‌రాజు,
- 823వ ర్యాంకు- ఇస్లావత్ శ్రీరామ్ హర్ష,
- 908వ ర్యాంకు- కట్టా ప్రత్యూష,
- 920వ ర్యాంకు- గోగుల రాజశేఖర్,
- 939వ ర్యాంకు- గుగులోతు జితేందర్ నాయక్
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు:
ఈ ఏడాది మొత్తం 1087 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రాగా, కేటగిరీల వారీగా కేటాయింపులు ఇలా ఉన్నాయి:
- IAS (భారత పరిపాలనా సేవ): 180 పోస్టులు (జనరల్-74, OBC-47, SC-28, ST-13, EWS-18)
- IPS (భారత పోలీస్ సేవ): 150 పోస్టులు (జనరల్-60, OBC-42, SC-22, ST-11, EWS-15)
- IFS (భారత విదేశీ సేవ): 55 పోస్టులు
- ఇతర కేంద్ర సర్వీసులు: గ్రూప్ 'ఎ’లో 507, గ్రూప్ 'బి’లో 195 పోస్టులు ఉన్నాయి.
అభ్యర్థులకు ముఖ్య సూచనలు:
ఫలితాలు ఇప్పుడు upsc.gov.in అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థుల వ్యక్తిగత మార్కుల వివరాలను మరో 15 రోజుల్లో వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయనున్నారు. అభ్యర్థుల రిజర్వేషన్ ధృవీకరణ పత్రాలు తుది తనిఖీకి లోబడి ఉంటాయని, 348 మంది అభ్యర్థుల సిఫార్సులు ప్రస్తుతం తాత్కాలికంగా (Provisional) ఉన్నాయని కమిషన్ స్పష్టం చేసింది. సందేహాల నివృత్తి కోసం యూపీఎస్‌సీ ఫెసిలిటేషన్ కౌంటర్‌ను (011-23385271) పనిదినాల్లో సంప్రదించవచ్చు.
🚨 UPSC Final Result is out.
— UPSC NOTES (@UPSC_Notes) March 6, 2026
Congratulations to all those who made it to the list. Your hard work has paid off.
For those who couldn’t make it this time, stay strong. pic.twitter.com/m7R5Zri6Bt












Click it and Unblock the Notifications