రేపే యూపీఎస్‌సీ ప్రిలిమ్స్ పరీక్ష.. వీటిని పాటించాల్సిందే..!
రేపే (జూన్ 16) యూపీఎస్‌సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. ఇక, ఇప్పటికే యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచిన సంగతి తెలిసిందే. దేశంలోని అత్యున్నత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్, ఫారెస్ట్ సర్వీసెస్ ప్రాథమిక పరీక్ష-2024 నిర్వహణకు యూపీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది.
దేశవ్యాప్తంగా జూన్ 16వ తేదీన యూపీఎస్‌సి ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. అయితే. ఇప్పటివరకు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోని విద్యార్థులు వెంటనే తమ హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోగలరు. అయితే, ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు వీటిని తప్పకుండా పాటించాల్సిందే... అవెంటో చూసేద్దాం..

యూపీఎస్‌సీ నిర్వహించే సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌కార్డులో ఫోటో సరిగాలేనివారు రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలను తమ వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. అభ్యర్థులు హాల్‌టికెట్‌తోపాటు ప్రభుత్వం జారీచేసిన ఏదైనా ఒరిజినల్ గుర్తింపు కార్డు (ఆధార్, పాన్‌కార్డు, ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డులు) ను తప్పుకుండా తమవెంట తీసుకెళ్లాలి. సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం దేశవ్యాప్తంగా ఏటా 10 లక్షల వరకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
ఇక, సంవత్సరానికి గాను మొత్తం 1056 పోస్టులను భర్తీచేయనున్నారు. వీటిల్లో 40 పోస్టులను కేవలం దివ్యాంగులకు మాత్రమే కేటాయించడం జరిగింది. యూపీఎస్‌సీ ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారమే జూన్ 16వ తేదీన పరీక్ష జరగనుంది. ఈ పరీక్ష మొత్తం రెండు సెషన్లలో ఉంటుంది. మొదటి సెషన్ ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు ఉంటుంది.
ఇది పేపర్-1 పరీక్ష, ఇక రెండో సెషన్..మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఉంటుంది. ఇది పేపర్-2. పరీక్ష సమయానికి పది నిమిషాల ముందునుంచే పరీక్ష కేంద్రంలోపలికి ఎటువంటి పరిస్థితుల్లో అభ్యర్థులను అనుమతించరు. అంటే ఉదయం 9.20 గంటల వరకు, మధ్యాహ్నం 2.20 గంటల వరకే మాత్రమే అభ్యర్థులకు పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు.












Click it and Unblock the Notifications