భారతీయులకు గుడ్ న్యూస్- అమెరికాలో పీక్ లో జాబ్ ఓపెనింగ్స్- అమాంతం తగ్గిన లేఆఫ్స్..!

అమెరికాకు ఉద్యోగాల కోసం వెళ్లాలనుకునే భారతీయులకు ఓ గుడ్ న్యూస్. దేశంలో మారిన పరిస్ధితుల్లో ఉద్యోగ ప్రకటనలు (US Job Openings) ఒక్కసారిగా భారీగా పెరిగాయి, అలాగే ఉద్యోగాల కోతలు కూడా కనిష్ట స్థాయికి చేరాయి. ఈ విషయాన్ని యూఎస్ బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ వెల్లడించింది. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో ఉద్యోగాల ప్రకటనలు అనూహ్యంగా భారీగా పెరిగి 7.52 మిలియన్లకు చేరుకున్నాయని, అలాగే ఉద్యోగాల కోతలు కనిష్ట స్థాయికి తగ్గిపోయాయని తన తాజా నివేదికలో పేర్కొంది.

ట్రంప్ ను నమ్మి 5 మిలియన్లు పోగొట్టుకున్న మస్క్..! బోనస్ గా టెస్లా, స్పేస్ ఎక్స్ పై విచారణ..!
ట్రంప్ ను నమ్మి 5 మిలియన్లు పోగొట్టుకున్న మస్క్..! బోనస్ గా టెస్లా, స్పేస్ ఎక్స్ పై విచారణ..!

అగ్రరాజ్యంలో మారిన ఈ పరిస్ధితుల వెనుక పలు కారణాలు కనిపిస్తున్నాయి. ఇందులో అమెరికా సంస్థలు ఉద్యోగాల కోతల విషయంలో చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తుండమే. అలాగే భారీగా ఉద్యోగాల ప్రకటనలు ఇస్తున్నా అవి ఫుల్ టైమ్, శాశ్వత ఉద్యోగాలు కాదు. తాత్కాలిక ఉద్యోగుల్ని చాలా కంపెనీలు ఎక్కువగా నియమించుకున్నట్లు నిపుణులు చెప్తున్నారు. అలాగే అమెరికా సంస్థలు ప్రత్యేక నైపుణ్యాలకు దూకుడుగా ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఏఐ, జనరేటివ్ ఏఐ, క్లౌడ్ ఆర్కిటెక్చర్, సైబర్ సెక్యూరిటీ, అడ్వాన్సెడ్ డేటా అనలిటిక్స్, స్పెషలైజ్డ్ హెల్త్ కేర్, బయోటెక్ నైపుణ్యాలు ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు.

US Job Openings Rise Sharply Layoffs Fall to One-Year Low Impact on Indian Tech Workers
OBC కోటా ఉద్యోగాల క్రీమిలేయర్ పై సుప్రీంకోర్టు స్పష్టత..! కేంద్రం అభ్యర్ధనకు నో..!
OBC కోటా ఉద్యోగాల క్రీమిలేయర్ పై సుప్రీంకోర్టు స్పష్టత..! కేంద్రం అభ్యర్ధనకు నో..!

అయితే ఇన్ని సానుకూలతల మధ్య కూడా ప్రతికూల వలసలు (రివర్స్ మైగ్రేషన్ ) కొనసాగుతున్నాయి. దీనికి ట్రంప్ సర్కార్ అనుసరిస్తున్న వీసా ఆంక్షల విధానం, ఇమ్మిగ్రేషన్ మార్పులు, గ్రీన్ కార్డుల కోతలు కారణమవుతున్నాయి. అయినా నైపుణ్యం ఉన్న నిపుణుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. అలాగే అమెరికా వంటి అభివృద్ది చెందిన మార్కెట్ల నుంచి తిరిగి వస్తున్న ఉన్నత స్థాయి నిపుణులు భారత్ లో ఐటీ రంగానికి ప్రోత్సాహంగా మారుతున్నారు. దీంతో స్థానికంగా వీరితో పోటీ పడే వారికి కష్టాలు తప్పేలా లేవు. వీరు పరిమితంగా ఉన్న సీట్ల కోసం విదేశాలకు వెళ్లి రిటర్న్ అయిన వారితో పోటీ పడాల్సిన పరిస్ధితి నెలకొంది. మరోవైపు సంప్రదాయ ఐటీ ఔట్ సోర్సింగ్ కంటే అభివృద్ది చెందుతున్న నిర్దిష్ట రంగాల్లోనే అత్యుత్తమ అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు. వీటికి గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు మంచి ఉదాహరణగా చెప్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+