వాలెంటైన్స్ డే స్పెషల్.. ఓటీటీలోకి తెలుగు బోల్డ్ సిరీస్..!

ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా లో దాదాపు మూడేళ్ల క్రితం '3 రోజెస్' వెబ్ సిరీస్ వచ్చిన విషయం తెలిసిందే. డైరెక్టర్ మారుతి అండ్ టీమ్ నుంచి వచ్చిన ఈ వెడ్ సిరీస్‌ కు యువత నుంచి మంచి క్రేజ్ దక్కింది. ఇందులో ఈషా రెబ్బా, హర్ష చెముడుతో పాటు మిగతా వాళ్లు చేసిన వినోదం అందరికీ నచ్చుతుంది. దాంతో ఆ సిరీస్ కు సీక్వెల్ గా '3 రోజెస్ సీజన్ 2' ను గతంలో తీసుకొచ్చారు. ఇది కూడా యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది. '3 రోజెస్ సీజన్ 2' కూడా ఇప్పటికే స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఇక ఈ సిరీస్‌ లో ఈషా రెబ్బా, రాశి సింగ్, కుషిత కల్లపు లీడ్ రోల్స్‌ లో నటించి తమ యాక్టింగ్ తో మెప్పించారు.

అయితే.. ఈ బోల్డ్ వెబ్ సిరీస్‌ ను ఇప్పుడు మూవీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు వెబ్ సిరీస్ నిర్మాణ సంస్థ పేర్కొంది. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు మేకర్స్ తాజాగా వెల్లడించారు. ఇక ఈ వెబ్ సిరీస్ ‌ను చూడని వారు ఈ చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేస్తారని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ బోల్డ్ రొమాంటిక్ కామెడీ చిత్రం ప్రేక్షకులను ఏమాత్రం అలరిస్తుందో చూడాలి.

3RosesSeason2 Blooms on Valentine s Day Chaos Comedy amp amp Love Drop Feb 14 on Aha ott platform

ఇక ఈ సినిమాను కిరణ్ కె కరవల్ల డైరెక్ట్ చేశారు. అలాగే ఎస్‌ కే ఎన్ ప్రొడ్యూస్ చేశారు. దీనికి షో రన్నర్ గా మారుతి ఉండటం విశేషం. రెండో సీజన్ లో నాలుగు ఎపిసోడ్లు మాత్రమే ఉన్నాయి. ఈ సిరీస్ రీతూ, మేఘన, సృష్టి అనే ముగ్గురు అమ్మాయిల చుట్టూ తిరిగే కథ. ముంబై నేపథ్యంలో స్టోరీ సాగుతుంది. అక్కడి లైఫ్ స్టైల్ కు తగినట్లే ఈ కొత్త సీజన్ తొలి సీజన్ కంటే మరింత బోల్డ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో ఈషా రెబ్బా, రాశి సింగ్, కుషిత ముగ్గురు తమ నటనతో మెప్పించారు. కామెడీ, ఎమోషనల్ డైలాగ్స్‌ తో ఆకట్టుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+