చంద్రబాబు పాత్ర చేసిన నటుడిపై కేసు నమోదు
నటుడు శ్రీతేజ్‌పై కేసు నమోదైంది.తాజాగా అతనిపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో జీరో ఎఫ్ఐఆర్ నమోదైందని పోలీసులు తెలిపారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి.. తనను మోసం చేశాడంటూ ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అయితే, గతంలోనూ ఆయనపై ఇలాగే ఓ కేసు నమోదు అయినట్లుగా తెలుస్తోంది. ఓ మహిళతో శ్రీతేజ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఈ విషయం తెలియడంతో సదరు మహిళ భర్త గుండెపోటుతో స్పాట్‌లోనే మృతి చెందారు.
ఈ విషయం తెలిసిన మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులు శ్రీతేజ్‌పై మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ కేసు విచారణ కొనసాగుతుండగానే.. పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరంగా వాడుకున్నారని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.యువతి ఫిర్యాదు మేరకు విచారణ పోలీసులు చేపట్టారు. తాజాగా నమోదైన కేసుతో ప్రస్తుతం శ్రీతేజ్ ఆజ్ఞాతంలోకి వెళ్లాడు. ఆయన కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

శ్రీతేజ్ తెలుగులో పలు హిట్ సినిమాల్లో నటించారు. మంగళవారం, పుష్ప,నారప్ప, అక్షర, లక్ష్మీస్ ఎన్టీఆర్,ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం వంటి సినిమాల్లో శ్రీతేజ్ కీలక పాత్రల్లో కనిపించి మెప్పించాడు. ముఖ్యంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో ఏపీ సీఎం చంద్రబాబుగా నటించి మంచి గుర్తింపు దక్కించుకున్నాడు.












Click it and Unblock the Notifications