పాకిస్థాన్ కు బిగ్ రిలీఫ్.. గుడ్ న్యూస్ చెప్పిన సౌదీ అరేబియా

పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. పశ్చిమాసియాలో ఇరాన్- అమెరికా మధ్య యుద్దం కారణంగా ఆ ప్రభావం ప్రపంచదేశాలతోపాటు పాకిస్థాన్ పైనా గట్టిగానే పడుతోంది. ఇక పాకిస్థాన్ గతంలో తన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకునేందుకు సౌదీ అరేబియా నుంచి భారీ మొత్తంలో ఆర్థిక సాయం పొందిన సంగతి తెలిసిందే. అయితే ఈ రుణం చెల్లించే గడువును తాజాగా మరో మూడేళ్లు పెంచుతూ పాకిస్థాన్ కు గుడ్ న్యూస్ చెప్పింది సౌదీ అరేబియా. పాకిస్థాన్ లోని 5 బిలియన్ డాలర్ల డిపాజిట్లను మూడేళ్లపాటు పొడిగిస్తూ సౌదీ రాజధాని రియాద్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాకిస్థాన్ తో ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరోసారి పునరుద్ఘాటించింది.

సౌదీ అరేబియా తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి మహమ్మద్ ఔరంగజేబ్ ధ్రువీకరించారు. ఇది దేశంలోని ఆర్థిక విధానాన్ని మెరుగుపరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే విషయంపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ గవర్నర్ జమీల్ అహ్మద్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితిలో సౌదీ పాత్రపై పార్లమెంట్ ఆవరణలో స్పందించారు. సౌదీ అరేబియాకు రుణాన్ని పాకిస్థాన్ ఇప్పట్లో చెల్లించే అవకాశం లేదని స్పష్టం చేశారు. డెడ్ లైన్ ను మరో మూడేళ్లపాటు పొడిగింపు చేస్తున్నట్లు సౌదీ ప్రకటన చేసిందని అన్నారు.

"వడ్డీ రేట్లు తగ్గుముఖం పట్టడం కారణంగా పాకిస్థాన్ విదేశీ రుణ చెల్లింపుల భారం 2024-25 ఆర్థిక సంవత్సరంలోని దాదాపు 26.5 బిలియన్ డాలర్ల నుంచి 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ 21.5 బిలియన్ డాలర్లకు గణనీయంగా తగ్గింది. ఈ మొత్తం 21.5 బిలియన్ డాలర్లలో దాదాపు 3.5 బిలియన్ డాలర్లను ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో వడ్డీ చెల్లింపుల కోసం కేటాయించే అవకాశం ఉంది" అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ జమీల్ అహ్మద్ స్పష్టం చేశారు.

మొత్తం రుణాల్లో 12 బిలియన్ డాలర్లు సెంట్రల్ బ్యాంక్ లో డిపాజిట్ల రూపంలో ఉన్నాయని.. అలాగే మరో 3 బిలియన్ డాలర్లు రీఫైనాన్స్ అవకాశం ఉన్న వాణిజ్య రుణాలను కలిగి ఉన్నాయి. మిగిలిన 7 బిలియన్ డాలర్లు విదేశీ రుణాలుగా ఉన్నాయని జమీల్ అహ్మద్ పేర్కొన్నారు.

Pakistan Big relief Saudi Arabia extending the deadline for loan repayment by another three years

ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ డేటా ఆధారంగా పాకిస్థాన్ లో విదేశీ మారక నిల్వలు 17.2 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అలాగే మొత్తం విదేశీ మారక నిల్వలు 22.6 బిలియన్ డాలర్లలో 17.2 బిలియన్ డాలర్లు స్టేట్ బ్యాంక్ లోని విదేశీ మారక నిల్వలు కాగా 5.4 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు కమర్షియల్ బ్యాంక్ ల వద్ద ఉన్నాయి. ఇక సౌదీ అరేబియా వరుసగా మూడోసారి రీఫండ్ ను పోస్ట్ పోన్ చేయడంపై పాకిస్థాన్ పార్లమెంట్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+