పెళ్లాం కంటే పెంపుడు కుక్కలే ఎక్కువా ???.. నటుడి డివోర్స్ స్టోరీ వైరల్ !
బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు "అరుణోదయ్ సింగ్". రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించినా కానీ.. నటుడిగా ఎదగడం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఆయన తాత Arjun Singh మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా సేవలందించగా.. తండ్రి Ajay Singh రాష్ట్ర రాజకీయాల్లో కీలక నాయకుడిగా గుర్తింపు పొందారు. ఈ బలమైన రాజకీయ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పటికీ, అరుణోదయ్ సినిమాలపై ఆసక్తి పెంచుకుని తనదైన మార్గాన్ని ఎంచుకున్నారు.
ఫిల్మ్ కెరీర్..
2009లో 'సికిందర్' మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత యే సాలి జిందగీ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలానే జిస్మ్ 2, మై తేరా హీరో, మిస్టర్.ఎక్స్, మోహెంజో దారో, బ్లాక్‌మెయిల్ వంటి సినిమాల్లో నటించారు. ఇక అఫ్రాన్ వెబ్ సిరీస్‌లో అతని నటనకు ప్రశంసలు దక్కాయి. కెరీర్ పరంగా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

ఇక అరుణోదయ్ వ్యక్తిగత జీవితానికి వస్తే.. 2016 డిసెంబర్ 13న కెనడాకు చెందిన లీ ఎల్టన్‌ను ఆయన ప్రేమించి వివాహం చేసుకున్నారు. మొదట్లో వారి వివాహ జీవితం సాఫీగా సాగినప్పటికీ, కొంతకాలానికి చిన్నచిన్న అభిప్రాయ భేదాలు తలెత్తాయి. ముఖ్యంగా అరుణోదయ్‌కు పెంపుడు కుక్కలంటే ఎంతో ఇష్టం ఉండగా, వాటి వల్ల కలిగే శబ్దం, అసౌకర్యం లీ ఎల్టన్‌కు ఇబ్బందిగా మారింది. ఈ అంశం ఇద్దరి మధ్య తరచుగా గొడవలకు దారితీసింది. చిన్నపాటి సమస్యగా ప్రారంభమైన ఈ వివాదం క్రమంగా పెరిగి, చివరికి వారి బంధాన్ని ప్రభావితం చేసింది.
మొత్తానికి పరస్పర అవగాహన లోపించడం వల్ల ఇద్దరూ విడిపోవడమే మంచిదని భావించి, పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు.ఈ విషయం బయటకు రావడంతో "కుక్కల కారణంగా విడాకులా?" అంటూ బీ-టౌన్‌లో పెద్ద చర్చ జరిగింది. అయితే సంబంధాల్లో చిన్న విషయాలను కూడా పట్టించుకోకపోతే అవి పెద్ద సమస్యలుగా మారుతాయని ఈ ఘటన స్పష్టంగా చూపించింది.
విడాకుల తర్వాత కూడా అరుణోదయ్ సింగ్ తన పెంపుడు జంతువులపై ప్రేమను కొనసాగిస్తూ, సోషల్ మీడియాలో వాటితో గడిపే క్షణాలను పంచుకుంటూ ఉంటారు. వ్యక్తిగత జీవితంలో ఎదురైన అనుభవాలను కూడా ఆయన ఓపెన్‌గా షేర్ చేస్తుంటారు.












Click it and Unblock the Notifications