నా లైఫ్ టైటానిక్ షిప్ అయింది... పవిత్రాలోకేష్ పై నరేష్ సంచలన వ్యాఖ్యలు
నరేష్ - పవిత్రా లోకేష్ జంట గురించి దక్షిణ భారతదేశంలో తెలియనివారు లేరు. దేశంలోకి కరోనా అడుగు పెట్టిన సమయంలో ప్రజలంతా ఆ వైరస్ కు సంబంధించిన వార్తలను తెలుసుకోవడానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చేవారు. కరోనా తర్వాత వారు తెలుసుకోవడానికి ఆసక్తి చూపించిన మరో వార్త నరేష్ -పవిత్రా లోకేష్ జంట గురించే. అంతాగా వారు ప్రాచుర్యం పొందారు. కన్నడ సినీ పరిశ్రమలోకి హీరోయిన్ గా ప్రవేశించి కాలక్రమంలో తెలుగులో అమ్మ క్యారెక్టర్లు వేస్తున్న సమయంలో నరేష్ తో పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. తన మూడోభార్యకు విడాకులివ్వడానికి అడ్డంకులుండటంతో అధికారికంగా అవి వచ్చేంతవరకు వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు.
అర్థం చేసుకునేవారు దొరికితే అదృష్టమే
వీరిద్దరూ హానీమూన్ కు వెళ్లామని ప్రకటించారు. తర్వాత మూడో భార్య కూడా ఎటువంటి రచ్చ చేయలేదు. తాజాగా తన 52వ పుట్టినరోజును జరుపుకున్న నరేష్ పవిత్రా లోకేష్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తాను వేసుకున్న చొక్కా పవిత్ర బహుమతిగా ఇచ్చిందేనని చెప్పారు. తను తన జీవితంలోకి రావడం అనేది టైటానిక్ షిప్ ఒడ్డుకు చేరినట్లైందన్నారు. జీవితం అన్న తర్వాత మనల్ని అర్థం చేసుకునే భాగస్వామి దొరకాలని, అలా దొరికినవారు ఎంతో అదృష్టవంతులని, వారి కాపురం, వారి జీవితాలు సజావుగా సాగుతాయన్నారు. తాము నటులుగా ఉన్నప్పటికీ వ్యక్తిగత జీవితం కూడా బాగుండాలంటే తమగురించి బాగ తెలిసిన పరిశ్రమకు చెందినవారైతేనే బాగుంటుందని భావిస్తామన్నారు.

జీవితం జాగ్రత్తగా అవతలి ఒడ్డుకు చేరుకుంటుంది
అలాంటివారు దొరికినప్పుడు వివాహం చేసుకోవడానికి పరిశ్రమవారంతా ప్రయత్నించేది అందుకేనని, వారైతేనే తమ సాధక బాధకాలన్నీ అర్థం చేసుకుంటారని నరేష్ చెప్పారు. తనకు కూడా పవిత్రా లోకేష్ అలా దొరకిందని, తను భాగస్వామిగా ఉంటే జీవితం జాగ్రత్తగా అవతలి ఒడ్డుకు చేరుతుందన్నారు. తన జీవితం సంతోషంగా ఉందన్నా, జాగ్రత్తగా నడుచుకుంటున్నాన్నా, ఇంటికి వచ్చిన తర్వాత సంతోషకరమైన క్షణాలను ఆస్వాదిస్తున్నాన్నా అందుకు కారణం పవిత్రా లోకేష్ అని నరేష్ అన్నారు. ప్రస్తుతం ఆమెపై నరేష్ చేసిన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. మరోసారి వీరిద్దరూ వార్తల్లో నిలిచారని, ఏదేమైనప్పటికీ 60లో 20లా ఈ జంట ఉందని, వీరికి బెస్ట్ విషెస్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications