పుష్ప 2 చెత్త రికార్డును బ్రేక్ చేసిన "ధురంధర్".. ఇంత దారుణంగానా ??
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ హీరోగా వచ్చిన మూవీ "ధురంధర్". ఆదిత్యధర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ రెండు పార్టులుగా తెరకెక్కింది. ఫస్ట్ పార్ట్ కంటే కూడా రెండో పార్ట్ భారీ హిట్ కొట్టింది. ఈ మూవీలో నాన్న మూవీ ఛైల్డ్ ఆర్టిస్ట్ సారా అర్జున్ హీరోయిన్ గా చేయగా.. సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, మాధవన్, అక్షయ్ ఖన్నా వంటి దిగ్గజ నటులు కీలక పాత్రల్లో నటించారు. 'ధురంధర్ ' మొదటి పార్టుని కేవలం హిందీలో మాత్రమే ముందు రిలీజ్ చేయగా.. సెకండ్ పార్టుని హిందీతో పాటు పాన్ ఇండియా లెవల్లో దక్షిణాది భాషలన్నింటిలోనూ చాలా గ్రాండ్‌గా ఈ సినిమాని రిలీజ్ చేశారు. ఇండియన్ సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది ఈ చిత్రం.
ఈ ఫ్రాంచైజీలోని రెండు చిత్రాలు కలిసి దాదాపు రూ.3,100 కోట్లకు పైగా వసూలు చేశాయి. కాగా బాహుబలి పుణ్యమా అని తెలుగు సినిమాలకు గ్లోబల్ స్థాయిలో మంచి క్రేజ్ నెలకొంది. మరి ముఖ్యంగా జపాన్ లో మన చిత్రాలకు మరింత డిమాండ్ పెరిగింది. గతంలో సూపర్ స్టార్ రజినీకాంత్ 'ముత్తు' సినిమాతో జపాన్ లో కూడా భారీ హిట్ అందుకున్నారు. ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ 'ఆర్ఆర్ఆర్' మూవీ సైతం మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఆ తర్వాత ఎన్టీఆర్ 'దేవర' సినిమా సైతం రిలీజ్ అవ్వగా.. రీసెంట్ గానే అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రాన్ని కూడా రిలీజ్ చేశారు. ఈ క్రమంలోనే జూలై 10న దురంధర్ మూవీని గ్రాండ్ గా రిలీజ్ చేశారు.

అయితే జపాన్‌లో విడుదలైన ఈ యాక్షన్ చిత్రం అక్కడి ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. సుమారు 80 స్క్రీన్‌లలో ఈ చిత్రం విడుదల కాగా.. గట్టిగానే ప్రమోషన్స్ కూడా చేశారు. కానీ నివేదికల ప్రకారం.. జపాన్‌లోని టాప్ 25 చిత్రాల జాబితాలో కూడా ఈ చిత్రం చోటు సంపాదించలేకపోయిందని తెలుస్తోంది. విడుదలైన మొదటి రోజున ఈ చిత్రాన్ని కేవలం 900 మంది ప్రేక్షకులు మాత్రమే చూశారని సమాచారం.
కాగా జపాన్ లో ఇప్పటి వరకు సల్మాన్ ఖాన్ నటించిన 'టైగర్ 3' మొదటి రోజు 1300 టికెట్స్‌తో చివరి స్థానంలో ఉంది. కొన్ని రోజుల క్రితమే ఇక్కడ రిలీజైన పుష్ప 2 మూవీ కూడా కేవలం 886 టికెట్స్ మాత్రమే తెంచగలిగింది. ఇప్పుడు దురంధర్‌కు 900 టికెట్స్ మాత్రమే బుకింగ్స్ లభించాయి. దాంతో పుష్ప చెత్త రికార్డును ఈ మూవీ అధిగమించింది అని అంటున్నారు.
జపాన్‌లో మొదటి రోజు ఎక్కువ టికెట్స్ పొందిన ఇండియన్ సినిమాలు..
8230 టికెట్లతో 'ఆర్ఆర్ఆర్' అతిపెద్ద ఇండియన్ ఓపెనర్ చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత వరుసగా 'సాహో', 'కల్కి 2898 ఏడీ', 'పఠాన్', 'సలార్', 'జవాన్', 'రంగస్థలం', 'దేవర', 'బాహుబలి 2' 'టైగర్ 3' సినిమాలు ఉన్నాయి.














Click it and Unblock the Notifications