IIT క్రాక్ చేయలేదు..! కానీ టైర్-3 కాలేజీలో చేరి అద్భుతాలు..! మరో సక్సెస్ స్టోరీ..!
మన దేశంలో ఐఐటీ(IIT)లకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. జేఈఈ పరీక్ష రాసి ఎలాగైనా ఐఐటీ క్రాక్ చేయాలని తపించే వారు లక్షల్లో ఉన్నారు. వారికి తగినట్లుగానే తల్లితండ్రులు కూడా లక్షలు ఖర్చుపెట్టేందుకు సిద్దమైపోతున్నారు. కానీ ఐఐటీ క్రాక్ చేయలేక వీరిలో దాదాపు 90 శాతం మంది నిరాశపడుతూనే ఉన్నారు. ఇలాంటి వారి కోసమే ఓ ఇంజనీరింగ్ విద్యార్ధి తన స్నేహితుడి స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది కాస్తా ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఐఐటీలో సీటు సంపాదించలేకపోయిన తన స్నేహితుడు, తాము చదువుతున్న టైర్-3 ఇంజనీరింగ్ కళాశాలలోనే అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థులలో ఒకడిగా ఎలా ఎదిగాడో ఓజస్ శర్మ అనే విద్యార్ది వెల్లడించాడు. ఎక్స్ లో పెట్టిన ఓ పోస్టులో అతను
తాను, తన స్నేహితుడు 12వ తరగతి తర్వాత జేఈఈ రాసినా ఉత్తీర్ణత సాధించలేకపోయినట్లు తెలిపాడు. అప్పుడు తాను ఓ టైర్-3 ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో చేరానని వెల్లడించాడు. అతని స్నేహితుడు మాత్రం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోసం ఐఐటీ ఢిల్లీలో గానీ లేదా మరో ఐఐటీలో గానీ ప్రవేశం పొందాలనే ఆశతో ఏడాది పాటు గ్యాప్ తీసుకున్నాడు. అయినా అతను ఆ సీటు క్రాక్ చేయలేకపోయాడు.

చివరికి ఆ ఏడాది తర్వాత అతని స్నేహితుడు శర్మ చేరిన అదే కళాశాలలో అతని జూనియర్ గా చేరాడు. ఆ తర్వాత ఆ స్నేహితుడి జీవితమే మారిపోయింది. అతను కొన్ని ప్రఖ్యాత క్లబ్‌లకు అధ్యక్షుడయ్యాడు, నమ్మశక్యంకాని హార్డ్‌వేర్ ప్రాజెక్టులను నిర్మించాడు. డ్రోన్‌లను తయారు చేశాడు. హ్యాకథాన్‌లను గెలుచుకున్నాడని శర్మ వివరించాడు. గతంలో తగినన్ని అవకాశాలు కల్పించడం లేదని సంవత్సరాల తరబడి తన కాలేజీని నిందించానని, తన స్నేహితుడి విజయాలు ఆ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేశాయని శర్మ తెలిపాడు. తద్వారా దేశంలోని త్రీటైర్ కాలేజీలు సైతం విద్యార్ధుల కెరీర్ లను ఎలా మలుపు తిప్పుకున్నాయో వెల్లడించాడు.















Click it and Unblock the Notifications