ఏపీలో విద్యార్థుల కోసం కీలక నిర్ణయం.. రెండు విడతల్లో ఆ క్యాంపులు.. త్వరపడండి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ సర్కార్ విద్యార్థుల కోసం అనేక కీలక నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతుంది. ఈ క్రమంలో విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని మరో ముఖ్యమైన కార్యక్రమం చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ లో విద్యార్థుల ఆధార్ కార్డు అప్డేట్ మరియు కొత్త నమోదుల కోసం ప్రత్యేక సెంటర్ లను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమాన్ని తల్లిదండ్రులకు, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తిగా ఉచితంగా నిర్వహిస్తోంది.
రెండు విడతలుగా స్పెషల్ డ్రైవ్
ఈ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా నేటి నుండి 17 వతేదీ వరకు మొదటి విడత ఆధార్ అప్డేషన్, కొత్త నమోదులు చేసుకోవచ్చు. ఇక రెండో విడత జులై 21 నుండి జులై 24 వరకు నిర్వహించబడుతుంది. మొత్తం 8 రోజుల పాటు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. విద్యార్థులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

నైపుణ్యం కలిగిన సిబ్బందితో ఆధార్ అప్డేషన్
ముఖ్యంగా 5 సంవత్సరాల నుండి 17సంవత్సరాల మధ్య ఉన్న విద్యార్థులకు ఈ కార్యక్రమం బాగా ఉపయోగపడుతుంది. ఈ సెంటర్స్ లో ఆధార్ నమోదుతో పాటు, బయోమెట్రిక్ అప్డేట్ చేస్తారు. గ్రామ సచివాలయాలు,వార్డు సచివాలయాల నుంచి నైపుణ్యం కలిగిన సిబ్బందిని ఈ సెంటర్లకు కేటాయించారు. వారు బయో మెట్రిక్ వివరాలు, ఫింగర్ ప్రింట్ లు, ఐరిస్ స్కాన్ లు మరియు ఇతర అవసరం అయిన అప్డేట్ లను సులభంగా పూర్తి చేస్తారు.
ఆధార్ అప్డేషన్ అందుకే
వివిధ ప్రభుత్వ పథకాల నుండి లబ్ది పొందటం కోసం దరఖాస్తులు వేసుకోవటం, స్కాలర్ షిప్ లు, తల్లికి వందనం వంటి లాభాలను పొందటానికి ఇది అత్యంత కీలకం. అంతేకాదు చిన్న పిల్లలవేలి ముద్రలు కాలక్రమేణా మారుతూ ఉంటాయి. కనుక వారి బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవటం అవసరం. ఏపీ ప్రభుత్వం గత సంవత్సరం కూడా ఇదే విధంగా ఆధార్ అప్డేషన్ కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఆధార్ అప్డేషన్, కొత్త ఆధార్ కార్డులకు ఈ పత్రాలు తప్పనిసరి
అయితే ఇంకా చాలా మంది విద్యార్థుల వివరాలు అప్డేట్ కాలేదని అధికారులు గుర్తించిన క్రమంలో తాజాగా మరొకసారి విద్యార్థుల కోసం ఆధార్ అప్డేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఆధార్ అప్డేట్ చేసుకోవాలి అనుకున్న విద్యార్థులు వారి ఆధార్ కార్డు, కొత్తగా నమోదు చేసుకునే వారైతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, చిరునామా కోసం ధృవీకరణకు సంబంధించిన పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.
ఇబ్బంది లేకుండా ఆధార్ కార్డుల సవరణ
స్కూల్స్ లోనే ఈ అప్డేషన్ అందుబాటులో ఉండడం వల్ల తల్లిదండ్రులు ఎటువంటి ఇబ్బంది లేకుండా తమ పిల్లల ఆధార్ కార్డులను సవరించుకోవచ్చు. ఇది విద్యార్థుల భవిష్యత్తు అవసరాలను సులభతరం చేయడం మాత్రమే కాకుండా, తల్లిదండ్రులకు ఆధార్ అప్డేషన్ కోసం మీసేవ కేంద్రాల చుట్టూ తిరిగే బాధను తప్పిస్తుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ కార్యక్రమం ద్వారా అధికారులు వీలైనంత త్వరగా ఆధార్ విషయంలో ఇబ్బందులు ఉన్న విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని పేరెంట్స్ కోరుతున్నారు.












Click it and Unblock the Notifications