హీరోయిన్‌తో ఎఫైర్: టాలీవుడ్ హీరో‌పై లవర్ కంప్లైంట్

Raj Tarun: టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై పోలీసు కేసు నమోదైంది. హైదరాబాద్ నార్సింగి పోలీసులు ఈ కేసు ఫైల్ చేశారు. అతని ప్రియురాలు లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు పెట్టారు. టాలీవుడ్‌కే చెందిన ఓ హీరోయిన్‌తో ఎఫైర్ పెట్టుకోవడమే దీనికి కారణమని తెలుస్తోంది.

రాజ్ తరుణ్ లేటెస్ట్ మూవీ.. తిరగబడరా సామి. ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను జరుపుకొంటోంది. ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకుడు. మన్నారా, మాల్వీ మల్హోత్ర, అంకిత థాకూర్, మకరంద్ దేశ్‌పాండే, రఘుబాబు ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిందీ మూవీ. దీని తరువాత భలే ఉన్నాడే.. సినిమా షూటింగ్‌లో పాల్గొంటోన్నాడు.

Actor Raj Tarun s girl friend lodged a complaint against him

ఈ పరిస్థితుల్లో అతనిపై కేసు నమోదైంది. అతని లవర్ లావణ్య నార్సింగి పోలీసులకు లిఖితపూరకంగా ఫిర్యాదు చేశారు. 10 సంవత్సరాలుగా రాజ్‌ తరుణ్‌తో తాను రిలేషన్‌షిప్‌లో ఉన్నానని,. గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని అన్నారు. కొంతకాలంగా తనను దూరం పెడుతున్నాడని చెప్పారు.

మూడు నెలలుగా రాజ్‌తరుణ్ ఇంటికి కూడా రావట్లేదని రాతపూరకంగా పోలీసులకు తెలియజేశారు. తనతో పాటు ఓ సినిమాలో నటిస్తోన్న హీరోయిన్‌తో ఎఫైర్‌ పెట్టుకొన్నాడని ఆరోపించారు. ఆమె వ్యామోహంలో పడి తనను నిర్లక్ష్యం చేస్తోన్నాడని ఆరోపించారు. రాజ్‌ తరుణ్‌ను తాను వదిలేయకపోతే చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేస్తోన్నారని లావణ్యం ఆందోళన వ్యక్తం చేశారు.

తన మృతదేహాన్ని కూడా మాయం చేస్తామంటూ బెదిరింపు ఫోన్ కాల్స్ చేస్తోన్నారని ఆమె పోలీసులకు లిఖితపూరకంగా వివరించారు. గతంలో తనను అన్యాయంగా, అకారణంగా డ్రగ్స్‌ కేసులో ఇరికించారని వాపోయారు. ఈ కేసులో అరెస్టయి 45 రోజుల పాటు జైల్లో ఉన్నానని గుర్తు చేశారు. అప్పుడు కూడా రాజ్‌ తరుణ్ నుంచి ఎలాంటి సాయం అందలేదని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+