భార్యకు విడాకులిచ్చి ..వదినతో పెళ్లికి రెడీ అయిన హీరో
భార్యకు విడాకులిచ్చి వదిన వరుస అయ్యే నటితో పెళ్లి చేసుకోవడానికి ఓ నటుడు రెడీ అయ్యాడు. ఆ నటుడు మరెవ్వరో కాదు సాయి కిరణ్. అవును మీరు వింటుంది నిజమే. సాయి కిరణ్ గురించి కొత్తగా పరిచియం చేయాల్సిన పని లేదు. 2000లో వచ్చిన 'నువ్వే కావాలి' సినిమాతో తరుణ్‌కు ఎంత పేరొచ్చిందో.. అందులో కీలక రోల్ ప్లే చేసిన సాయి కిరణ్‌కు కూడా అంతే పేరొచ్చింది. మరీ ముఖ్యంగా 'అనగనగా ఆకాశం ఉంది' అని పాట ఎక్కడైన వినిపిస్తే చాలు.. సాయి కిరణే గుర్తుకు వస్తారు. ఆ తర్వాత కూడా పలు హిట్ సినిమాల్లో సాయి కిరణ్ నటించాడు.
కానీ ఊహించని విధంగా హీరోగా కిరణ్ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. డార్లింగ్ డార్లింగ్, కానీ, జగపతి, గోపి ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ప్లాప్ కావడంతో సాయి కిరణ్ కెరీర్ గాడి తప్పింది. దాంతో తనకు సినిమా ఆఫర్స్ రావడం కూడా తగ్గుముఖం పట్టాయి.ఇదే సమయంలో సీరియల్స్‌లో అవకాశాలు రావడంతో అటు వైపు వెళ్లారు. ఇక సీరియల్స్‌లో మాత్రం కొంత కాలం ఏకచక్రాధిపత్యం కొనసాగించారు. ఏ ఛానల్‌లో చూసిన సాయి కిరణ్ సీరియలే వచ్చేవి. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ సీరియల్స్ కూడా సాయి కిరణ్ నటించాడు.

తాజాగా సాయి కిరణ్ రెండో పెళ్లికి సిద్ధమవుతున్నాడు. 2010లో వైష్ణవి అనే అమ్మాయిని సాయి కిరణ్ పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ పాప కూడా ఉంది. అయితే గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో వీరు విడాకులు తీసుకున్నారని తెలుస్తోంది. తాజాగా ఈ నటుడు రెండో పెళ్లి సారి పెళ్లి పీఠలెక్కబోతున్నాడు. తనతో పాటు 'కోయిలమ్మ' సీరియల్‌లో నటించిన స్రవంతితో నిశ్చితార్థం చేసుకున్నాడు సాయికిరణ్. ఈ సీరియల్‌లో స్రవంతి సాయికిరణ్‌కు వదినగా నటించింది. ప్రస్తుతం వీరి నిశ్చితార్థం ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications