ప్రముఖ నటుడు సప్తగిరి ఇంట తీవ్ర విషాదం..
ప్రముఖ నటుడు, కమెడియన్ సప్తగిరి గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. అయితే సప్తగిరి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. సప్తగిరి తల్లి చిట్టెమ్మ తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. బెంగళూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు. ఆమె అంత్యక్రియలు తిరుపతిలోని పద్మాపురం ఎదురుగా ఉన్న శ్రీనివాసపురంలో ఈరోజు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. చిట్టెమ్మ భౌతికకాయానికి నివాళి అర్పించేందుకు పలువురు సినీ ప్రముఖులు రానున్నట్టు సమాచారం.
అసిస్టెంట్ డైరెక్టర్ గా పలు సినిమాలకు పనిచేసి ఆ తర్వాత బొమ్మరిల్లు సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత పరుగు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ నటుడు.. కందిరీగ, దరువు, గబ్బర్ సింగ్, జులాయి, ప్రేమ కథా చిత్రమ్, లవర్స్, రాజు గారి గది, ఎక్స్ ప్రెస్ రాజా, క్రాక్, వాల్తేరు వీరయ్య వంటి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు.

కమెడియన్ గానే కాకుండా హీరోగాను పలు సినిమాల్లో నటించారు. సప్తగిరి ఎక్స్ ప్రెస్, సప్తగిరి ఎల్ఎల్ బీ సినిమాల్లో హీరోగా చేసిన ఆయన ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
సప్తగిరి హీరోగా నటిస్తూ, నిర్మించిన చిత్రం 'పెళ్లి కాని ప్రసాద్'. కామెడీ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ చిత్రానికి అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ విడుదల చేస్తుండగా.. మార్చి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.
రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా పెళ్లి కాని ప్రసాద్ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. అందులో ప్రసాద్ అనే నేను.. కట్నం శాసనాల గ్రంథంలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌కు గౌరవం ఇస్తూ తరతరాలుగా కట్నం విషయంలో మా తాతముత్తాతలు ఫాలో అవుతున్న షరతులకు కట్టుబడి ఉంటానని మా తాతముత్తాతల మీద ప్రమాణం చేస్తున్నా'' అంటూ సప్తగిరి చెప్పే డైలాగ్ బాగా ఫేమస్ అయ్యింది.












Click it and Unblock the Notifications