పవన్ కళ్యాణ్‌కి 'కట్టప్ప' సత్యరాజ్ మాస్ వార్నింగ్.. దేవుడి పేరుతో రాజకీయాలా అంటూ !

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల తమిళనాడులో జరిగిన "మురుగన్ మానాడు" అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరయ్యారు. ఏపీలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ముగించుకుని ప్రత్యేక ఆహ్వానం మేరకు తమిళనాడు వెళ్లి ఆ వేడుకలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రముఖ తమిళ నటుడు సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా హీట్ పెంచాయి.

దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తే ఊరుకోం..

కాగా వీసీకే పార్టీ నిర్వహించిన ఓ సభలో మాట్లాడిన సత్యరాజ్ ఇన్ డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. "దేవుడి పేరుతో తమిళనాడులో రాజకీయాలు చేస్తే ఊరుకోమని" వార్నింగ్ ఇచ్చారు. పెరియార్ సిద్ధాంతాల్ని నమ్మిన మమ్మల్ని ఎవరు మోసం చేయలేరని అన్నారు. తమిళ ప్రజలు తెలివైన వారు అని, తమిళనాట మీ ఆటలు సాగవు అని వ్యాఖ్యానించారు. మమ్మల్ని మోసం చేశారని అనుకుంటే అది మీ తెలివి తక్కువ తనమవుతుందని విమర్శలు గుప్పించారు సత్యరాజ్ . ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

actor-sathya-raj-warning-to-pawan-kalyan

అయితే తాను చేసిన వ్యాఖ్యల్లో సత్యరాజ్ ఎవరి పేరును స్పష్టంగా చెప్పకపోయినా కూడా.. సామాజిక మాధ్యమాల్లో మాత్రం పవన్ కళ్యాణ్‌నే ఉద్దేశించి చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ద్రావిడియన్ భావజాలానికి వ్యతిరేకంగా ఎవరైనా అడుగు వేస్తే ఎదురుదెబ్బ తప్పదు అనే భావనను సత్యరాజ్ ప్రస్తావించినట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు.

మరోవైపు సత్యరాజ్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆయనను పొగడ్తలతో ముంచెత్తుతుంటే.. మరికొందరు వ్యక్తిగతమైన అభిప్రాయాలను ఇలా బహిరంగ వేదికలపై చర్చించడం కరెక్ట్ కాదని విమర్శిస్తున్నారు. అయితే ఈ వ్యాఖ్యల పట్ల పవన్ కళ్యాణ్ ఇంకా స్పందించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+