నితిన్ హీరోయిన్ ఇంత దారుణంగా మారిపోయిందేంటి..?
హీరోయిన్ అదా శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన హార్ట్ ఎటాక్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. నితిన్ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. నటించిన తొలి సినిమాతోనే సూపర్ హిట్ కావడంతో అదా శర్మ కెరీర్ దూసుకుపోతుందని అనుకున్నారంతా. అయితే ఆమెకు అనుకున్నంత క్లిక్ కాలేకపోయింది. అదా శర్మకు తెలుగులో పెద్దగా ఆఫర్లు దక్కలేదు. ఇదే సమయంలో సెకండ్ హీరోయిన్‌గా నటించడంతో ఆమెకు మెయిన్ హీరోయిన్‌గా అవకాశాలు రాలేదు.
దీంతో బాలీవుడ్ బాటపట్టిన అదా శర్మ, అక్కడ బాగానే ఆఫర్లు పట్టేసింది. తన టాలెంట్‌తో వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ముఖ్యంగా 'ది కేరళ స్టోరీ' సినిమా అదా శర్మ మంచి గుర్తించు తెచ్చిపెట్టింది. ఈ సినిమా తర్వాత అదా శర్మ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా మారింది. ప్రస్తుతం అన్ని భాషల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అదా శర్మ ఎప్పటికప్పడు తన వ్యక్తిగత విషయాలను సైతం పోస్ట్ చేస్తుంటుంది. తన లేటెస్ట్ ఫొటోలతో పాటు, తన సినిమా విశేషాలను కూడా అభిమానులతో పంచుకుంటుంది ఈ హాట్ బ్యూటీ.

అదా శర్మ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలు చేశారు. ఈ ఫొటోల్లో అదా శర్మ గుర్తు పట్టలేని విధంగా మారిపోయింది. ఈ ఫొటోల్లో అదా శర్మ బామ్మ గెటప్ వేసుకుని ఉంది. ''ఎవరో గుర్తుపట్టండి. తప్పు సమాధానం చెబితే హెలికాఫ్టర్ గిఫ్ట్‌గా ఇస్తాను. మా కొత్త ఎపిసోడ్‌లు వస్తున్నాయి. వచ్చి చూసి ఎంజాయ్ చేయండి. అవి వస్తూనే ఉంటాయి'' అంటూ తన పోస్ట్‌కు క్యాప్షన్ జత చేసింది. ప్రజెంట్ అదా శర్మ ఫొటోలు చూసిన వారంతా ఇలా గుర్తుపట్టలేనంతగా మారిపోయిందేంటని అంటున్నారు. 2024లో అదా శర్మ 'బస్తర్: ది నక్సల్ స్టోరీ' చిత్రంతో ప్రేక్షకులను మెప్పించింది. ప్రజెంట్ ఈ అమ్మడు నటించిన 'రీటా సన్యాల్' అనే వెబ్‌సిరీస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్‌లోని ఫొటోలే అదా శర్మ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం అదా శర్మ షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications