vastu tips: ఏ రాశివారికి ఏ దిక్కున ఉండే ఇళ్లు వాస్తుపరంగా కలిసి వస్తాయి?
జ్యోతిష్య శాస్త్రంలో జన్మరాశి, నక్షత్రాలు ఒక ఎత్తైతే... నివసించే ఇంటి వాస్తు మరొక ఎత్తు. కానీ, "రాశిని బట్టి వాస్తు ఉంటుందా? అందరికీ ఒకే వాస్తు వర్తిస్తుందా? అసలు పేరు లేదా నక్షత్రాన్ని బట్టి ఇంటి ముఖద్వారంఎంచుకోవాలా?" అనే సందేహాలు చాలామందిలో ఉంటాయి. ముందుగా గ్రహాల ప్రభావం తెలిపే జాతకం, నివసించే ప్రాంగణంలోని శక్తుల ప్రభావం తెలిపే వాస్తు శాస్త్రం రెండూ వేర్వేరు. అయితే, ఒక వ్యక్తికి ఒక నిర్దిష్టమైన దిశ లాభిస్తుందా లేదా అనేది నిర్ణయించడంలో జాతకం, రాశి నక్షత్రాలు కీలక పాత్ర పోషిస్తాయి.
వాస్తు నిబంధనలు పంచభూతాల (భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం) ఆధారంగా అందరికీ ప్రాథమికంగా ఒకేలా పనిచేసినప్పటికీ, ఆ ఇంటి దిశ ఎవరికి బాగా కలిసివస్తుందనేది వారి జన్మరాశి, నామ నక్షత్రంపై ఆధారపడి ఉంటుంది. ఇంటిని లేదా ఫ్లాట్‌ను ఎంచుకునే ముందు ఆ ఇంటి యజమాని (సాధారణంగా కుటుంబంలో సంపాదించే ప్రధాన వ్యక్తి లేదా ఆస్తి ఎవరి పేరిట ఉందో వారు) పేరు, నామ నక్షత్రాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.

మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి: తూర్పు లేదా ఉత్తరం ముఖద్వారం ఉన్న ఇళ్లు బాగా కలిసివస్తాయి.
వృషభం, కన్య, మకరం రాశుల వారికి: దక్షిణ లేదా పడమర దిశలు అనుకూలిస్తాయి.
మిథునం, తులా, కుంభం రాశుల వారికి: పడమర లేదా ఉత్తరం ముఖద్వారాలు శ్రేయోస్కరం.
కర్కాటకం, వృశ్చికం, మీనం రాశుల వారికి: తూర్పు లేదా ఉత్తరం దిశలు విశేషమైన ఆర్థికాభివృద్ధిని ఇస్తాయి.
అందరికీ ఒకే వాస్తు వర్తిస్తుందా?
దిశల ఎంపిక నామ నక్షత్రాన్ని బట్టి మారినప్పటికీ, ఇంటి ఆవరణలో ఉండే 'అంతర్గత వాస్తు నిబంధనలు' మాత్రం అందరికీ ఒకేలా వర్తిస్తాయి.రాశితో సంబంధం లేకుండా ఈశాన్యం ఎప్పుడూ తేలికగా, పరిశుభ్రంగా, మూసివేయకుండా ఉండాలి. ఆగ్నేయంలో వంటగది, నైరుతిలో యజమాని పడకగది ఉండటం అనేది అందరికీ సమానంగా వర్తించే విశ్వజనీన వాస్తు సూత్రం.














Click it and Unblock the Notifications