చావుబతుకుల మధ్య విజయ్ హీరోయిన్.. సాయం కోసం అభ్యర్ధన
మలయాళ హీరోయిన్ అరుంధతి నాయర్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. దీంతో వెంటనే కేరళలోని తిరువనంతపురంలోని ఆస్పత్రిలో ఆమెను చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్టు అరుధంతి కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంటర్వ్యూ ఇచ్చి తిరిగి స్కూటీపై ఇంటికి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారు వేగంగా వచ్చి అరుంధతి స్కూటీని బలంగా ఢీ కొట్టింది.
ఈ ఘటనలో అరుంధతితో పాటు ఆమె సొదరుడు కూడా ఆమెతోనే ఉన్నాడు. అరుంధతి సొదరుడుకు సైతం తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం అరుంధతి తిరువనంతపురంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతుంది. అయితే చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆమెకు వైద్యం అందించడానికి ఆర్ధిక సాయం చేయాలంటూ సీరియల్ నటి గోపిక అనిల్ తన సోషల్ మీడియా వేదికగా అందర్నీ వేడుకున్నారు.

'నా స్నేహితురాలు అరుంధతికి నిన్న ప్రమాదానికి గురైంది. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం వెంటిలేటర్‌పై ప్రాణాలతో పోరాడుతోంది. రోజువారీ ఆసుపత్రి ఖర్చులు భరించే ఆర్ధిక స్థోమత ఆమె కుటుంబానికి లేదు. మేము మా వంతు కృషి చేస్తున్నాం. కానీ ప్రస్తుతం ఆమె చికిత్సకు అది సరిపోదు. ఆమె కుటుంబానికి మీరూ కూడా సహాయం చేస్తే ఆమెకు మెరుగైన చికిత్స అందించేందుకు సహాయపడుతుంది' అంటూ బ్యాంకు, ఫోన్ నంబర్ వివరాలను సోషల్ మీడియాలో పోస్టులో షేర్ చేసింది. దీనికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక అరుంధతి నాయర్ కెరీర్ విషయానికి వస్తే.. 2014లో వచ్చిన 'పొంగి ఎలు మనోహర' సినిమాతో సినీ కెరీర్ ప్రారంభించిన అరుంధతి.. ఆ తరువాత పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించింది.'ఒట్టకోరు కముకన్' అనే సినిమాతో హీరోయిన్‌గా మారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. 'సవిరుమాండికుమ్ శివానందికమ్', 'సైతాన్', 'పిస్తా', 'ఆయిరం పోర్కాసుకల్' చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. విజయ్ ఆంటోని సరసన నటించిన సైతాన్ మూవీ అరుంధతి నాయర్‌కు మంచి పాపులారిటీ తెచ్చి పెట్టింది. ఇక అరుంధతి చివరిగా గత ఏడాది విడుదలైన ఆయిరం 'పోర్కాసుకల్' అనే మువీలో నటించింది.
-
Dhurandhar 2 First Review: బ్లడ్ బాత్.. పాకిస్థాన్ కు పిండం పెట్టాడుగా..!! -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!!












Click it and Unblock the Notifications