సినిమాల కోసం ఆ కఠిన నిర్ణయం తీసుకున్నా: భాగ్యశ్రీ బోర్సే
సినిమాల్లోకి రావడం అనేది చాలా మంది యువతకు ఓ కల లాంటింది. కానీ ప్రతి ప్రయాణం అంత సులువుగా సక్సెస్ కాదు. ఒకవేళ సెక్సెస్ అయినా ఆ ప్రయాణం అడ్డంకులతో నిండి ఉంటుంది. ముఖ్యంగా మహిళలకు ఇది ఎంతో కష్టమైన విషయం. మహిళలు ఇండస్ట్రీలో రాణించాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. తాజాగా స్టార్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ఇటీవలి ఇంటర్వ్యూ ఆ వాస్తవాన్ని గుర్తు చేస్తుంది. తనకు యాక్టింగ్‌పై ఉన్న ఇంట్రెస్ట్‌ను తమ కుటుంబ సభ్యులెవరూ మొదట్లో ప్రోత్సహించలేదని హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే వెల్లడించారు. అఖిల్ కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటించిన సినిమా 'లెనిన్' అద్భుత విజయం సాధించిన నేపథ్యంలో ఓ కాలేజీ విద్యార్థులతో టాక్ షోలో ఆమె ముచ్చటించారు. తన సినిమా జర్నీ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఆ ఇంటర్వ్యూలో భాగ్యశ్రీ బోర్సే ముచ్చటిస్తూ.. తాను సినిమాల్లో కెరీర్ కొనసాగించాలని నిర్ణయించుకున్నప్పుడు తన కుటుంబం మద్దతు ఇవ్వలేదని వెల్లడించారు. ఆమె కుటుంబ సభ్యులందరూ ఆమె నిర్ణయాన్ని వ్యతిరేకించారు. కానీ నిరాశ చెందకుండా, ఆ నటి తన కలను సాకారం చేసుకోవడానికి అనేక ఆడిషన్లకు హాజరయ్యారు. ఆ సమయంలో భాగ్యశ్రీ సినీ పరిశ్రమలో కెరీర్‌ను ఎంచుకున్నందున, ఆమె తల్లి ఆరు నెలల పాటు ఆమెతో మాట్లాడటానికి నిరాకరించింది. వాట్సాప్‌లో కూడా ఆమెను బ్లాక్ చేసింది. ఆ రోజులను గుర్తుచేసుకుంటూ, అది తన జీవితంలో ఒక బాధాకరమైన దశ అని భాగ్యశ్రీ బోర్సే చెప్పుకొచ్చింది. చెప్పింది.

భావోద్వేగపరమైన ఎదురుదెబ్బలు తగిలినా, ఆ నటి ఏకాగ్రతతో కష్టపడి పనిచేసింది. ఈ రోజు ఆమె కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఇతరులెవరూ నమ్మనప్పుడు, కొన్నిసార్లు మిమ్మల్ని మీరు నమ్మడమే చాలని నిరూపిస్తూ భాగ్యశ్రీ ఇప్పుడు తన నటనకు ప్రశంసలు అందుకుంటోంది.














Click it and Unblock the Notifications