పెళ్లైన 16 రోజులకే విడాకులిచ్చిన తెలుగు హీరోయిన్
సినీ ఇండస్ట్రీలో విడాకులు తీసుకునే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. సెలబ్రిటీలు ఎంత వేగంగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారో అంతే వేగంగా విడాకులు కూడా తీసుకుంటున్నారు. ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే సినీ తారలు ఎక్కువైపోతున్నారు. ఏ రోజు ఎవరు విడాకులు గురించి ప్రకటిస్తారో అనే విధాంగా పరిస్థితి మారిపోయింది. కలిసి ఉండలేక స్టార్స్ ఇలా విడాకుల బాట పడుతున్నారు.
చాలామంది సెలబ్రిటీల జీవితాలు ఇలాగే ఉన్నాయి. భాషతో సంబంధం లేకుండా చాలామంది సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటున్నారు. నటి ఎస్తేర్ సైతం విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ వివరాల్లోకి వెళ్తే..నటి ఎస్తేర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చేయాల్సిన పనిలేదు.ఎస్తేర్ అందాలకు ప్రత్యేక అభిమానులు ఉన్నారంటే ఆమె క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. కన్నడ సినిమాలతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఆ తర్వాత తెలుగులో హీరోయిన్‌గా ఇచ్చింది.

పూరి జగన్నాథ్ తమ్ముడు సాయి రామ్ శంకర్ హీరోగా నటించిన వేయి అబ్బదాలు సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా నటించింది.మరీ ముఖ్యంగా భీమవరం బుల్లోడులో నటించిన తర్వాత ఈ బ్యూటీ క్రేజ్ మరింత పెరిగింది. ఇక తర్వాత గరం, జయ జానికి నాయక, జాలియట్ లవర్ ఆఫ్ ఇడియట్, నయనం, ఐరావతం,69 సంస్కార్ కాలనీ, చాంగురే బంగారు రాజా, డేవిల్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ వంటి వాటిల్లో నటించి తన కంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకుంది.
ఇక ప్రముఖ సింగర్ నోయెల్ సీన్ కొన్నాళ్లు ప్రేమయాణం సాగించిన ఈ భామ .. 2019లో అతన్ని వివాహం చేసుకుంది. పెళ్లైన కొద్ది నెలలకే అభిప్రాయభేదాలు రావడంతో అతనికి విడాకులిచ్చింది. విడాకులపై ఎస్తేర్ ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ..తన మాజీ భర్త నోయల్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. పెళ్లైనా 16 రోజులకే అతని నిజస్వరూపం బయటపడింది.
అలాగే బిగ్‌బాస్ హౌస్‌లో కూడా సింపథి కోసం నా గురించి చాలా బ్యాడ్‌గా మాట్లాడాడు అంటూ ఎస్తేర్ చెప్పుకొచ్చింది. ఇక అతనితో కలిసి జీవించలేనని తెలిసిన తర్వాతే ఆయనతో నోయల్ నుంచి విడిపోయానని ఈ భామ చెప్పుకొచ్చింది.పెళ్లి తర్వాత కొన్ని సినిమాల్లో నటించిన ఎస్తేర్ తన గ్లామర్‌తో అదరగొట్టింది. ముఖ్యంగా రెక్కి సినిమాలో ఎస్తేర్ ఓ రేంజ్‌లో రెచ్చిపోయి అందాలను ఆరబోసింది. ఈ సినిమా తర్వాత చాలామంది ఎస్తేర్‌కు అభిమానులుగా మారిపోయారు.












Click it and Unblock the Notifications