టాలీవుడ్ స్టార్ హీరో 15 సార్లు నా చంపపై గట్టిగా కొట్టి.. సారీ అడిగారు !
నటి ఇషా కొప్పికర్.. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్.. ఇలా అన్ని ఇండస్ట్రీల్లోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మోడలింగ్ నుంచి కెరీర్ ప్రారంభించిన ఆమె.. తక్కువ సమయంలోనే సినిమాల్లోకి అడుగుపెట్టారు. 1997 లో 'వర ప్రసాద్' అనే చిత్రంలో అతిథి పాత్రలో నటించి తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత రెండో సినిమానే నాగార్జున హీరోగా వచ్చిన.. 'చంద్రలేఖ' మూవీ కావడం విశేషం. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 1998లో విడుదలై మంచి మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో రమ్యకృష్ణ, ఇషా హీరోయిన్స్ గా నటించారు.
తన కెరీర్‌లో 50కు పైగా సినిమాల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ. హిందీ, తమిళంతో పాటు తెలుగు చిత్రాల్లోనూ ఆమె తన ప్రత్యేకతను చాటుకున్నారు. తెలుగులో చివరిగా 2017లో నిఖిల్ నటించిన 'కేశవ' చిత్రంలో కనిపించారు. ప్రస్తుతం ఆమె పలు వెబ్ సిరీస్‌లలో నటిస్తూ బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఇషా.. 'చంద్రలేఖ' షూటింగ్ సమయంలో నాగార్జున తనను చెంపపై 15 సార్లు కొట్టడంతో వాతలు కూడా వచ్చాయని చెప్పడం చర్చనీయాంశంగా మారింది.

ఇషా ఏమన్నారంటే..?
చంద్రలేఖ తనకి రెండో సినిమా అని.. ఆ సినిమాలోని ఓ సీన్‌లో తాను చాలా సీరియస్‌గా నటించాల్సి వచ్చిందని గుర్తు చేసుకున్నారు. నాగార్జున తనని చెంపపై కొట్టే సీన్ అని.. ఆయన మొదట చాలా సాఫ్ట్‌గా కొట్టారని అన్నారు. కానీ అప్పట్లో తనకు అంత అనుభవం లేదు కాబట్టి.. తానే 'గట్టిగా కొట్టండి.. నాకు నిజంగా కోపం రావాలి' అని అడిగానని వెల్లడించింది. దాంతో షాట్ బాగా రావాలని, రీటేక్స్ తీసుకుంటూ దాదాపు 14-15 సార్లు తనను కొట్టారని తెలిపింది.
దాంతో ఆ తర్వాత చుస్తే తన మొహం మొత్తం ఎర్రగా అయిపోయిందని.. చెంప మీద వాతలు కూడా వచ్చాయని స్పష్టం చేసింది. ఈ తర్వాత నాగార్జున ఆమెను క్షమించమని అడిగినప్పటికీ.. సీన్ బాగా రావడానికి తప్పదు అని పర్లేదు అని చెప్పినట్టు క్లారిటీ ఇచ్చింది.

క్యాస్టింగ్ కౌచ్..
అంతే కాకుండా తాను 18 ఏళ్లకే సినిమాల్లోకి వచ్చానని.. అప్పట్లో పాత్రలు రావాలంటే 'ఫ్రెండ్లీ'గా ఉండాలని కొందరు చెప్పేవారని అన్నారు. ఒకసారి ఓ టాప్ హీరో తనను ఒంటరిగా కలవాలని కోరాడని.. ఎవరు లేకుండా రమ్మన్నాడని చెప్పింది. అందుకు తాను ఒప్పుకోలేదని చెప్పుకొచ్చింది.












Click it and Unblock the Notifications