రజనీ, కమల్‌లతో నటించింది.. చివరకు అనాథగా ఎయిడ్స్‌తో కన్నుమూసిన స్టార్ హీరోయిన్!

అప్పట్లో 80, 90 దశకాల్లో వెండితెరపై మెరిసిన ప్రముఖ హీరోయిన్ నిషా నూర్ జీవితం విషాద గాథలా మిగిలిపోయింది. సూపర్ స్టార్స్ రజనీకాంత్, కమల్ హాసన్, మమ్ముట్టి, మోహన్‌లాల్ వంటి మేటి నటుల సరసన నటించిన నిషా నూర్.. తన జీవిత ప్రయాణంలో ఎదురైన మోసాలు, ద్రోహాల కారణంగా చివరికి దీనస్థితిలో కన్నుమూశారు. సినీ ప్రపంచంలో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన నిషా నూర్.. తెరవెనుక మాత్రం కన్నీటి గాథగా మిగిలిపోయింది.

యాదృచ్ఛికంగా సినీ ప్రవేశం
తమిళనాడులో చాలా సాధారణ కుటుంబంలో జన్మించిన నిషా నూర్ దాదాపు యాదృచ్ఛికంగా సినిమాల్లోకి ప్రవేశించింది. ఆమె 1980లో తమిళ చిత్రం మంగళ నాయకితో తన నటనా రంగ ప్రవేశం చేసింది. త్వరలోనే తమిళం, మలయాళం, తెలుగు కన్నడ సినిమాల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. 1980లు, 1990వ దశకం ప్రారంభంలో ఆమె టిక్ టిక్ టిక్, శ్రీ రాఘవేంద్రర్, కళ్యాణ అగతిగల్, అయ్యర్ ది గ్రేట్, దేవాసురం, అవల్ సుమంగళితన్, ఇనిమై ఇదో ఇదో, ఇలమై కోలం, ఎనక్కగా కాతిరు వంటి అనేక ప్రముఖ చిత్రాల్లో నటించింది.

Actress Nisha Noor Tragic Story From Acting With Rajinikanth to Dying of AIDS in Destitution

కెరీర్ పతనం
రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు. సంవత్సరాలు గడిచేకొద్దీ, సినిమా అవకాశాలు తగ్గిపోయాయని సమాచారం. ఆమె కెరీర్ మందగించడంతో నిషా నూర్ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడం ప్రారంభించింది. పలు మీడియా నివేదికల ప్రకారం.. ఆమె కుటుంబాన్ని పోషించడానికే చాలా ఇబ్బంది పడింది. ఆమెకు కుటుంబం నుంచి గానీ, చిత్ర పరిశ్రమ నుంచి గానీ పెద్దగా మద్దతు లభించలేదు.

ప్రేమపేరిట మోసం.. వ్యభిచార కూపంలోకి..
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో నిషా నూర్ ఓ సినీ నిర్మాత ప్రేమలో పడ్డారు. ఆ నిర్మాత తనను గట్టెక్కిస్తాడని ఆమె భావించారు. కానీ ఆమె నమ్మకం కాస్త వమ్ము అయింది. ఆ వ్యక్తి ఆమెను పూర్తిగా మోసం చేయడంతో పాటు నిషా నూర్ దాచుకున్న పొదుపు మొత్తాన్ని దోచుకున్నాడు. దీంతో ఆమె తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారు. ఆమె పరిస్థితి మరింత దిగజారడంతో దుస్థితిని ఆసరాగా చేసుకుని కొన్ని దుష్టశక్తులు ఆమెను వ్యభిచారం కూపంలో నెట్టాయి.

ఎయిడ్స్‌తో విషాదాంతం
సంవత్సరాల తర్వాత, నిషా నూర్ తమిళనాడులోని ఓ దర్గా బయట వీధుల్లో నివసిస్తూ కనిపించిందని వార్తలు వచ్చాయి. ఒకప్పుడు తన అందానికి, తెరపై తన ఉనికికి ఎంతో ప్రశంసలు పొందిన ఆమె.. ఎంతగా బలహీనపడిపోయిందంటే ప్రజలు ఆమెను గుర్తుపట్టలేకపోయారు.ఓ తమిళ స్వచ్ఛంద సంస్థ ఆమెను రక్షించి, చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించినట్లు సమాచారం. వైద్య పరీక్షల సమయంలో ఆమె హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌తో బాధపడుతున్నట్లు వైద్యులు కనుగొన్నారని తెలిసింది. అప్పటికే ఆమె పరిస్థితి గణనీయంగా క్షీణించింది.వైద్య సంరక్షణ పొందినప్పటికీ, నిషా నూర్ 2007లో ఎయిడ్స్ సంబంధిత సమస్యలతో మరణించారు. ఆమె వయస్సు కేవలం 45 సంవత్సరాలు మాత్రమేనని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+