Poonam Kaur: ప్రముఖ దర్శకుడిపై పూనం కౌర్ ఫైర్..!
నటి పూనం కౌర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అది దర్శకుడు త్రివిక్రమ్ టార్గెట్ గా సెటైర్లు వేశారు. గుంటూరు కారం కాపీ కథ అని ప్రచారం చేసిన వెబ్ సైట్ పోస్టుని షేర్ చేస్తూ ట్విట్టర్(ఎక్స్) లో సంచలన వ్యాఖ్యలు చేశారు. త్రివిక్రమ్ ఏదిచేసినా చెల్లుతుంది. ఆయనను కొంత మంది ఇంకా గుడ్డిగా వెనకేసుకోస్తున్నారని ఘాటైన విమర్శలు చేశారు. త్రివిక్రమ్ అప్పటి ప్రభుత్వం మద్దతుఉందని.. సాధారణ ప్రజా సమస్యలు పట్టింపులేని ప్రభుత్వం ఆయనకు మాత్రం హెల్ఫ్ చేసిందంటూ రాసుకొచ్చారు.
పూనం కౌర్ ట్వీట్ అయితే వైరల్ అవుతోంది. పూనం కౌర్ వ్యాఖ్యలపై త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంతవరకు స్పందించలేదు. గుంటూరు కారం కథను సులోచనా రాణి నవలలను స్ఫూర్తిగా తీసుకుని త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిచ్చారని ప్రచారం జరుగుతోంది. గతంలో కూడా సులోచన రాణి నవల 'మీనా' ఆధారంగా ఆయన అ ఆ సినిమాని తెరకెక్కించారట. అప్పట్లో టైటిల్స్ లో సులోచన రాణి కి క్రెడిట్ ఇవ్వలేదు అని కేసు కూడా నమోదయింది.

ఆ తరువాత కూడా ఇంటిదొంగ చిత్రాన్ని ఆధారంగా తీసుకొని అలా వైకుంఠపురంలో సినిమా తీసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. తాజాగా గుంటూర్ కారం సినిమా కూడా కాపీ అని విమర్శలు వస్తున్నాయి. మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. అతడు, ఖలేజా లాంటి సినిమాల తరువాత త్రివిక్రమ్.. మహేష్ బాబుతో చేస్తున్న సినిమా కావడంతో మహేష్ బాబు ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.
పూనం కౌర్ గతంలో కూడా పలు వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ టార్గెట్ ఆమె కొన్నిసార్లు విమర్శలు చేశారు. తాజాగా త్రివిక్రమ్ పై మరోసారి విమర్శలు చేసి వార్తల్లో నిలిచారు.












Click it and Unblock the Notifications