సినిమాలు లేకపోయినా.. సంపాదన రూ.కోట్లలో!
తమిళంలో ప్రముఖ నటుడు విజయ్ కుమార్ వారసురాలిగా ప్రీతి విజయ్ కుమార్ హీరోయిన్ గా ఒకప్పుడు రాణించారు. వివాహం తర్వాత సినిమాలకు దూరమయ్యారు. వాస్తవానికి ఇప్పటి ప్రేక్షకులకు ఆమె గురించి పూర్తిగా తెలియదు. 1998లో రుక్మిణి అనే చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం అయింది. తర్వాత తెలుగు, తమిళం, మళయాళ భాషల్లో నటించింది. నరసింహ సినిమాలో రజనీకాంత్ కూతురిగా నటించి మంచి పాపులారిటీని సంపాదించుకుంది.
మా అన్నయ్య, క్షేమంగా వెళ్లి లాభంగా రండి, చందు, ప్రియమైన నీకు వంటి చిత్రాల్లో నటించింది. 2002లో దర్శకుడు హరిని వివాహం చేసుకొని నటనకు గుడ్ బై చెప్పింది. ప్రస్తుతం ఈ జంటకు ముగ్గురు కుమారులు ఉన్నారు. ప్రీతి విజయ్ కుమార్ నటనకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటారు. తన సోదరి శ్రీదేవితో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేస్తుంటుంది.

సినిమాలు మానుకున్నప్పటికీ వ్యాపారంలో మాత్రం చాలా బిజీగా ఉంటున్నారు. అంతేకాదు.. భారీగా ఆస్తులను సంపాదించారు. కోట్ల రూపాయల ఆదాయం ఉంది. చెన్నై సముద్ర తీరంలోని ఉత్తండి ప్రాంతంలో ప్రీతి ప్యాలెస్ పేరుతో కల్యాణ మండపాన్ని నిర్మించారు. దీనికి సమీపంలోనే మెట్రో కాఫీ హౌస్ ను ఏర్పాటు చేశారు. ఇందులో విశేషం ఏమిటంటే.. అందరూ మహిళలే పనిచేస్తుంటారు. మరోవైపు మద్రాస్ కాఫీ పేరుతో ఫ్రాంచైజీలు ఇస్తున్నారు. దీనిద్వారా లక్షల రూపాయల ఆదాయం సమకూరుతోంది.
సాలిగ్రామంలో సినీ ఎడిటింగ్, డబ్బింగ్ స్టూడియో ను నిర్వహిస్తున్నారు. ఈమె భర్త హరి కమర్షియల్ డైరెక్టర్ గా మంచి విజయాలతో దూసుకుపోతున్నారు. సినిమాల్లో నటించకపోయినప్పటికీ అంతకుమించి ఎక్కువగా పాపులారిటీని సంపాదించుకుంటున్నారు. తన అందంతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ అమ్మడు మళ్లీ సినిమాల్లో నటించాలని అభిమానులు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications