హత్య కేసులో హీరో అరెస్టు, శిక్షపడాలని పరోక్షంగా కోరుకుంటున్న ప్రముఖ నటి, మాజీ ఎంపీ
శ్యాండిల్ వుడ్ నటుడు, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ హత్య కేసులో అరెస్టు అయ్యాడు. హీరో దర్శన్ తో పాటు అతని ప్రియురాలు, నటి పవిత్ర గౌడను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్యాండిల్ వుడ్ లో హీరో దర్శన్ అరెస్టు కావడం, అతని ప్రియురాలు పవిత్రా గౌడను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో కన్నడ సినిమా రంగంలోని పెద్దలు షాక్ అయ్యారు.
ఇదే సమయంలో ప్రముఖ నటి, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ రమ్యా చేసిన రీట్వీ వైరల్ అవుతోంది. నటి రమ్యా (దివ్య స్పందన) కన్నడ నటుడు దర్శన్ గురించిన ఓ వార్తను రీట్వీట్ చేసింది. శ్యాండిల్ డీ బాస్ దర్శన్ కు సరైన జైలు శిక్షపడాలని నటి రమ్యా మరోక్షంగా కోరుకోవడంతో చాలెంజింగ్ స్టార్ అభిమనులు మండిపడుతున్నారు. కన్నడ హీరో దర్శన్ చిత్రదుర్గకు చెందిన రేణుకా స్వామి హత్య కేసుకు సంబంధించి అరెస్టు కావడం చర్చనీయాంశమైంది.

ఇది క్షమించరాని నేరం అంటూ చేసిన ట్వీట్ ను నటి రమ్యా రీట్వీట్ చేయడం ద్వారా హీరో దర్శన్ కు పరోక్షంగా శిక్ష పడాలని నటి రమ్యా కోరుకోవడంతో ఆ హీరో అభిమానులు రగిలిపోతున్నారు. రేణుకా స్వామి అనే వ్యక్తి హత్య కేసులో నటుడు దర్శన్‌పై విచారణ జరుగుతోంది. మంగళవారం సాయంత్రం దర్శన్‌తో సహా 13 మంది నిందితులు కోర్టు ముందు హాజరుపరచడానికి పోలీసులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలిసింది.

ఓ హత్య కేసులో దర్శన్‌పై ఏయే సెక్షన్ల కింద కేసు నమోదు చేశారనే సమాచారం ఇంకా పక్కగా బయటకురాలేదు. హత్య కేసుకు సంబంధించి సెక్షన్ 302, సెక్షన్ 369 (కిడ్నాప్) మరియు మరికొన్ని సెక్షన్ల కింద హీరో దర్శన్ మీద కేసులు నమోదు చేసి అతన్ని కోర్టు ముందు హాజరుపరుస్తారని తెలిసింది. రేణుకా స్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్ ను ఇప్పటికే అరెస్టు చేసిన పోలీసు అధికారులు అతన్ని విచారణ చేసి వివరాలు సేకరిస్తున్నారని తెలిసింది.
ఇలాంటి సమయంలో బహుబాష నటి, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ రమ్యా ఓ ప్రైవేట్ ఛానెల్ స్క్రీన్ షాట్‌లతో కూడిన పోస్ట్‌ను షేర్ చేసింది. కర్ణాటక బాక్సాఫీస్ ఖాతా ద్వారా ఒక పోస్ట్ చేయబడింది. సెక్షన్ 302 ప్రకారం, నటుడు దర్శన్‌కు జీవిత ఖైదు లేదా జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ కేసులో దోషిగా తేలకపోతే డబ్బు ప్రభావం పని చేసి, భారతీయ న్యాయ వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో అది అపహాస్యం అవుతుంది. బాధితులకు న్యాయం అందుతుందని మేము ఆశిస్తున్నాము అని ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ ను నటి రమ్యా రీట్విట్ చేసి ఆ పోస్ట్‌ను షేర్ చేసిన నటి రమ్య ఎలాంటి క్యాప్షన్ ఇవ్వలేదు. నటి రమ్యా, హీరో దర్శన్ కలిసి దత్త అనే సినిమాలో నటించారు. ఈ సినిమా పెద్ద హిట్ అయింది. అయితే దర్శన్ అభిమానుల దౌర్జన్య ప్రవర్తనపై నటి రమ్యా చాలాసార్లు తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. మొత్తం మీద గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీజేపీకి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేసిన హీరో దర్శన్ కు ఇప్పుడు కష్టాలు ఎదురైనాయి.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications