Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

"బికినీ" ఫోటోలపై సాయి పల్లవి షాకింగ్ రియాక్షన్..!!!

దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది "సాయి పల్లవి". ఆమెకు ఉన్న క్రేజ్, అభిమాన వర్గం ఇతర హీరోయిన్ల కంటే భిన్నంగా ఉంటుంది. తన సహజమైన నటన, డ్యాన్స్ స్కిల్స్, ప్రత్యేకమైన ఇమేజ్‌తో అభిమానులను సొంతం చేసుకున్నారు. సౌత్‌లో ఇప్పటికే స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న ఆమె.. ఇప్పుడు బాలీవుడ్‌లో సైతం నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. గ్లామర్ షో కి దూరం ఉంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుంది ఈ భామ. అందుకే టాలీవుడ్ ప్రేక్షకులు ప్రేమతో ఆమెను "లేడీ పవర్ స్టార్" అని పిలుస్తారు.

ఫిల్మ్ కెరీర్..

మలయాళంలో "ప్రేమమ్" సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు సాయి పల్లవి. మొదటి సినిమానే సాలీడ్ హిట్ అవ్వడం ఆమె కెరీర్‌కు బలమైన పునాది వేసింది. ఆ తర్వాత తెలుగులో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన నటించిన "ఫిదా" సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ అవ్వడంతో ఆమె ఒక్కసారిగా స్టార్ రేంజ్‌కి ఎదిగారు. ఫిదా తర్వాత సాయి పల్లవి వరుసగా ఎంసీఏ, పడి పడి లేచె మనసు, లవ్‌స్టోరీ, శ్యామ్ సింగరాయ్, విరాటపర్వం వంటి సినిమాల్లో నటించి నటిగా తన ప్రత్యేకతను చాటుకున్నారు. సహజమైన నటనతో పాత్లకు ప్రయాణం పోసేలా నటించి ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్నారు.

actress-sai-pallavi-latest-post-on-instagram-goes-viral

ఇక రీసెంట్ గానే తమిళంలో శివకార్తికేయన్ సరసన నటించిన "అమరన్" సినిమా ఘనవిజయం సాధించింది. అలాగే తెలుగులో నాగచైతన్యతో కలిసి నటించిన "తండేల్" కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే ఇటీవల సోషల్ మీడియాలో సాయి పల్లవి బికినీ వేసుకున్న కొన్ని ఫొటోలు ఫుల్ వైరల్ అయ్యాయి. ఆమె సోదరితో కలిసి బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న సమయంలో బికినీ వేసుకున్నట్టు జోరుగా చర్చ జరిగింది. అయితే ఇది సాయి పల్లవి ఇమేజ్‌కి ఇలా బికినీ వేసుకోవడం ఏంటని విమర్శించారు. అయితే ఎక్కువమంది అవి ఏఐ మార్ఫింగ్ ఫొటోలు కావచ్చని పోస్టులు పెట్టారు.

సాయి పల్లవి రియాక్షన్..

ఈ గందరగోళానికి సాయి పల్లవి లేటెస్ట్ గా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఫుల్ స్టాప్ పెట్టింది. తన అకౌంట్ లో తన సోదరితో పాటు ట్రిప్ కి వెళ్లిన ఫొటోలు, వీడియోలను రీల్ రూపంలో షేర్ చేశారు. అంతరే కాకుండా ఆ పోస్టుకు "ఇవి నిజమైన ఫొటోలు.. ఏఐతో చేసినవి కావు" అని క్యాప్షన్ ఇచ్చారు. దీంతో బికినీ రూమర్స్ కి సైలెంట్ గా చెక్ పెట్టినట్టు అయ్యిందని ఆమె ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.

బాలీవుడ్‌లో సీత పాత్ర..

ప్రస్తుతం సాయి పల్లవి నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ "రామాయణ" లో ఆమె సీతదేవి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సుమారు రూ.1600 కోట్లు బడ్జెట్ కేటాయించగా, ఇది రెండు భాగాలుగా రూపొందుతుంది. ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, యష్ రావణుడిగా, కాజల్ అగర్వాల్ మండోదరిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా నటిస్తున్నారు. పలువురు బాలీవుడ్, దక్షిణాది స్టార్ నటీనటులు ముఖ్యపత్రాలు పోషిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+