త్రిషకు స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్.. ఎవరు ఇచ్చారు ? ఏం ఇచ్చారో తెలిస్తే షాక్ పక్కా ???

దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా అగ్రస్థానంలో నిలిచిన అందాల భామ "త్రిష". తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. టాలీవుడ్‌లో దాదాపు అన్ని స్టార్ హీరోల సరసన నటించిన ఈమె తన నటనతో పాటు అందంతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఒక దశలో ఇండస్ట్రీలో అత్యధికంగా డిమాండ్ ఉన్న హీరోయిన్‌గా కొనసాగింది.

ఈ మధ్య కొంత విరామం తీసుకున్న త్రిష, సెకండ్ ఇన్నింగ్స్‌లో మరింత ఉత్సాహంతో తిరిగి ఎంట్రీ ఇచ్చింది. ముఖ్యంగా Ponniyin Selvan సినిమా ద్వారా ఆమెకు మళ్లీ భారీ క్రేజ్ వచ్చింది. ఆ సినిమాలో ఆమె పాత్రకు వచ్చిన ప్రశంసలు ఆమె కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయి. అయితే ఆ తర్వాత వచ్చిన 'థగ్ లైఫ్', 'ఐడెంటిటీ', 'విదాయమర్చి', 'గుడ్ బ్యాడ్ అగ్లీ' వంటి చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి.

actress-trisha-got-big-surprise-gift-from-mega-daughter-in-law-upasana-that-athammas-kitchen-pickles

అయితే సమ్మర్ వచ్చిందంటే చాలు.. తెలుగువారి ఇళ్లలో ఆవకాయ పచ్చళ్ల ఘుమఘుమలు మొదలైపోతాయి. ఇప్పుడు మెగా కోడలు ఉపాసన కొణిదెల నుంచి త్రిషకు ఒక అదిరిపోయే సమ్మర్ సర్‌ప్రైజ్ అందింది. మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' చిత్రంతో నటిస్తున్న త్రిష‌కు మెగా ఫ్యామిలీ నుంచి ఒక అదిరిపోయే సర్‌ప్రైజ్ అందింది. రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల.. త్రిషకు నోరూరించే ప్రత్యేకమైన గిఫ్ట్ పంపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఉపాసన కొణిదెల నేతృత్వంలో ప్రముఖ హోమ్ ఫుడ్ బ్రాండ్ 'అత్తమ్మాస్ కిచెన్' నడిపిస్తున్నారు. వీరి నుంచి త్రిషకు ఒక స్పెషల్ గిఫ్ట్ హ్యాంపర్ చేరింది. ఇందులో కొత్త ఆవకాయ పచ్చళ్లతో పాటు వివిధ రకాల పచ్చళ్లు, రుచికరమైన పొడులు ఉన్నాయి. ఆ గిఫ్ట్ బాస్కెట్‌ను ఫోటో తీసి తన అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. ఈ సందర్భంగా ఉపాసనకు ట్యాగ్ చేస్తూ.. "ఈ అద్భుతమైన గిఫ్ట్ చూస్తుంటే నాకు నిజంగానే వేసవి కాలం (సమ్మర్) వచ్చేసినట్లు అనిపిస్తోంది. థ్యాంక్యూ సో మచ్ ఉపాసన" అంటూ హార్ట్ ఎమోజీలతో తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. త్రిష పెట్టిన ఈ పోస్ట్‌ను ఉపాసన కూడా తన సోషల్ మీడియా ఖాతాలో రీ-షేర్ చేయడంతో, మెగా ఫ్యాన్స్ ఈ పోస్ట్‌లను తెగ వైరల్ చేస్తున్నారు.

ఇటీవల త్రిష తన సినిమాల కంటే వ్యక్తిగత విషయాలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా తమిళ స్టార్ హీరో Vijayతో ఆమె రిలేషన్‌పై వస్తున్న వార్తలు కోలీవుడ్‌లో పెద్ద చర్చకు దారి తీసాయి. సోషల్ మీడియాలో వీరిద్దరి గురించి అనేక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై త్రిష గానీ, విజయ్ గానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోవడం మరింత ఆసక్తిని పెంచుతోంది. ఇదే సమయంలో విజయ్ భార్య Sangeetha Sornalingam విడాకుల కోసం కోర్టును ఆశ్రయించినట్లు వార్తలు వెలువడ్డాయి. మరో నటితో విజయ్ సన్నిహితంగా ఉంటున్నారనే ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారం మరింత హాట్ టాపిక్ అయింది. ఈ నేపథ్యంలో కోర్టు విచారణకు నోటీసులు జారీ చేయడం కూడా చర్చనీయాంశమైంది. ఈ మొత్తం వివాదంలో త్రిష పేరు కూడా సోషల్ మీడియాలో బాగా వినిపించింది.

ఈ క్రమంలోనే ఇటీవల విజయ్, త్రిష కలిసి ఒక వివాహ వేడుకకు హాజరైన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ గాసిప్స్ మరింత హాట్ టాపిక్ అయ్యాయి. అంతే కాకుండా విజయ్ ఎన్నికల్లో గెలిచిన వేళ.. ప్రమాణ స్వీకారం చేసిన రోజు కూడా ఆమె కనిపించారు. ఇక రీసెంట్ గానే నటుడు అజిత్ తల్లి మరణించగా.. విజయ్ తో కలిసి వెళ్లి ఆమె నివాళులు అర్పించారు. ఈ క్రమంలోనే హీరో విజయ్‌తో నటి త్రిష రిలేషన్‌లో ఉన్నారంటూ వస్తోన్న వార్తలు కొన్ని రోజులుగా సినీ, రాజకీయ రంగాల్లో హాట్ టాపిక్‌గా మారాయి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+