Bigg Boss 9: 'అగ్నిపరీక్ష'లో దూసుకుపోతున్న కంటెస్టెంట్లు వీళ్లే..!
బిగ్ బాస్ టీమ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 'అగ్నిపరీక్ష' షో ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. బిగ్ బాస్ 9కు సామాన్య ప్రజల నుంచి కంటెస్టెంట్లను ఎంపిక చేసే ప్రక్రియగా దీనికి భారీ హైప్ ఇచ్చినా, వాస్తవానికి ఈ షో స్క్రిప్టెడ్ అని, ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా లేదని నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ముఖ్యంగా చివరి 15 మందిని ఎంపిక చేసిన విధానంపై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. టాలెంట్ ఉన్నవారిని పక్కన పెట్టి, టీమ్‌కు కావాల్సిన వారినే ఎంపిక చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
టాప్ ఓటింగ్ ఉన్న ప్రసన్న కుమార్ ఎలిమినేషన్
ప్రస్తుతం 'అగ్నిపరీక్ష' చివరి దశకు చేరుకోగా, మిగిలిన 15 మంది కంటెస్టెంట్స్‌ను జియో సినిమాలో ఓటింగ్‌లో పెట్టారు. అందుతున్న సమాచారం ప్రకారం, ప్రసన్న కుమార్ అందరికంటే ఎక్కువ ఓట్లతో మొదటి స్థానంలో ఉన్నాడు. అతని తర్వాత దమ్ము శ్రీజ రెండవ స్థానంలో ఉంది. ఆడిషన్స్‌లో జడ్జీలకు, ఆడియన్స్‌కు కూడా చిరాకు తెప్పించిన శ్రీజ, చివరి ఎపిసోడ్‌లో జడ్జీలు అన్యాయం చేశారని ధైర్యంగా నిలబడటంతో ఆమెకు మద్దతు భారీగా పెరిగింది. ప్రసన్న కుమార్, దమ్ము శ్రీజ తర్వాత పవన్ కళ్యాణ్ పడాలా, ప్రియా శెట్టి, శ్వేతా శెట్టి వంటి వారు ఓటింగ్‌లో ఉన్నారు.

అయితే, ఓటింగ్‌లో మొదటి స్థానంలో ఉన్న ప్రసన్న కుమార్ ఎలిమినేట్ అయినట్లు బయటి ప్రపంచానికి తెలిసింది. దీనిపై అతని ఇంటర్వ్యూలు కూడా వచ్చాయి. అత్యధిక ఓట్లు సాధించినా అతనెందుకు ఎలిమినేట్ అయ్యాడు, అసలు ఈ ఎంపిక ప్రక్రియ ఏంటి అనే విషయాలు రాబోయే ఎపిసోడ్స్‌లో వెల్లడి కానున్నాయి. మిగిలిన 15 మందిని మూడు గ్రూపులుగా విభజించి, ఒక్కో గ్రూప్‌కు ఒక జడ్జి న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తారని తెలుస్తోంది. ఇప్పటివరకు జడ్జీలు న్యాయంగా వ్యవహరించలేదనే అపవాదు ఉన్నందున, రాబోయే ఎపిసోడ్‌లు ఆ అపవాదును తొలగిస్తాయా లేదా అనేది చూడాలి.












Click it and Unblock the Notifications