ఐశ్వర్య రాయ్‌కి లీగల్ నోటీసులు..అతని వల్లే ఇదింతా
ఐశ్వర్య రాయ్ అంటే కేవలం ఒక పేరు మాత్రమే కాదు, భారతీయ సినీ పరిశ్రమలో ఒక బ్రాండ్. ఆమె అందం, అభినయం, కెరీర్ అంతా కలిపి ఆమెను ఒక ప్రత్యేక స్థానానికి తీసుకెళ్లాయి.1994లో విశ్వసుందరిగా ఎంపికైన ఐశ్వర్య రాయ్, తన అందంతో ప్రపంచాన్ని మంత్రముగ్ధులను చేసింది. ఆమె విజయం భారతీయ మహిళలకు ఒక స్ఫూర్తిగా నిలిచింది.విశ్వసుందరిగా గెలిచిన తర్వాత, ఐశ్వర్య రాయ్ సినీ రంగంలోకి అడుగుపెట్టింది. తమిళం, హిందీ సినిమాల్లో నటించి, తన అభినయ ప్రతిభను చాటుకుంది.

ఆమె నటించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయవంతమయ్యాయి. దేవదాస్ చిత్రంలో ఐశ్వర్య రాయ్ పోషించిన పాత్ర ఆమెకు ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టింది.జోధా అక్బర్ చిత్రంలో మొగల్ చక్రవర్తి అక్బర్ భార్య జోధాబాయి పాత్రను అద్భుతంగా పోషించింది.సల్మాన్ ఖాన్‌తో కలిసి నటించిన జై హో చిత్రం కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఐశ్వర్య రాయ్ బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్‌ను వివాహం చేసుకుంది. వారికి ఆరాధ్య అనే కూతురు ఉంది. అయితే ఓ సినిమాలో నటించినందుకుగానూ ఆమె ఏకంగా లీగల్ నోటీసులు అందుకున్నారనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు.

ధూమ్ 2 సినిమాలో నటించినందుకు తనకు కొందరు లీగల్ నోటీసులు పంపించారని ఐశ్వర్య రాయ్ స్వయంగా చెప్పడం జరిగింది. గతంలో ఐశ్వర్య రాయ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..ధూమ్ 2 సినిమాలో హృతిక్ రోషన్‌తో చేసిన లిప్‌లాక్ సీన్ కారణంగా తనకు లీగల్ నోటీసులు వచ్చాయని తెలిపింది. ఆ సన్నివేశంపై కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా తనను అమ్మాయిల అందరికీ రోల్ మోడల్‌గా భావించే వారు ఈ సీన్‌ను తప్పుబట్టారు. తాను యువతులకు ఆదర్శంగా ఉండాలని కోరుకునే వారి నుంచే ఇలాంటి నోటీసులు రావడం ఆశ్చర్యంగా ఉందని ఆమె ఈ ఇంటర్య్వూలో తెలిపారు. ఒక సినిమాలో కొన్ని సెకన్ల సీన్ కోసం ఎందుకు తనను వివరణ ఇవ్వమంటున్నారో అర్థం కావడం లేదని చెప్పింది. హాలీవుడ్, యూరోపియన్ సినిమాల్లో రొమాంటిక్ సీన్లు చేయడం లేదా అని ఆమె ప్రశ్నించింది.












Click it and Unblock the Notifications