నిమిషానికి రూ. 4.50 కోట్లు.. దేశంలోనే అత్యధిక పారితోషికం.. షారుఖ్, సల్మాన్, ప్రభాస్.. అంతా మటాష్.. ఎవరో తెలుసా

నిమిషానికి రూ. 4.50 కోట్లు పారితోషికం తీసుకునే నటుడు ఎవరో మీకు తెలుసా..? పూర్వం నటీనటులు సినిమాకు ఇంత అని తీసుకునేవాళ్లు. ఆ తర్వాత షేర్లు, గంటలు, నిమిషాల వ్యవధికి పారితోషికం తీసుకుంటున్నారు. ఈ లెక్కన భారతీయ చిత్ర పరిశ్రమలో నిమిషానికి రూ. 4.50 కోట్లు తీసకునే నటుడు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు. బాలీవుడ్ స్టార్ హీరోస్ షారుఖ్, సల్మాన్ మాత్రమే కాదు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పారితోషికం కూడా ఈ హీరోతో పోల్చుకుంటే తక్కువే. మరి ఆయన ఎవరో తెలుసా..?

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్ గణ్ చరిత్ర సృష్టించాడు. ఆయన ఓ సినిమాలో గెస్ట్ రోల్ లో నటించేందుకు నిమిషానికి రూ. 4.50 కోట్లు తీసుకున్నాడు. కేవలం 8 నిమిషాలు ఆ సినిమాలో కనపడి రూ. 35 కోట్లు పారితోషికం పొందాడు. ఈ క్రమంలో ఆయన ఒక్క నిమిషానికి అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడిగా రికార్డు నెలకొల్పాడు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో అజయ్ దేవ్ గణ్ కీలక పాత్రలో మెరిశారు. ఈ సినిమాలో ఆయన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రిగా, స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసే యోధుడి పాత్రలో నటించాడు. కేవలం 8 నిమిషాలు మాత్రమే స్క్రీన్ పై కనిపించిన అజయ్ దేవ్ గణ్ ఏకంగా రూ. 35 కోట్లు పారితోషికం తీసుకుని అందరినీ ఆశ్చర్య పరిచాడు.

భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక ఖరీదైన క్యామియో అజయ్ దేవ్ గణ్ ది అని ట్రేడ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ లెక్కన షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ప్రభాస్‌ లను మించి అజయ్ దేవ్ గణ్ పారితోషికం పొందారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. నిమిషాల పరంగా చూసుకుంటే అజయ్ దేవ్ గణ్ తీసుకున్న పారితోషికం ఆల్ టైమ్ టాప్. ఈ లెక్కన షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాలో 70 నిమిషాల పాటు కనిపిస్తే రూ. 300కోట్లు తీసుకోవాలి. కానీ ఇది సినిమా బడ్జెట్ కంటే ఎక్కువే. అలాగే జైలర్ లో రజినీకాంత్, కల్కి లో ప్రభాస్ లకు కూడా రూ. 300 కోట్లు రెమ్యూనరేషన్ అందాలి. కానీ వాళ్లు అలా తీసుకోలేదు.

Ajay Devgn s Record-Breaking Rs 4 5 Crore Per Minute for RRR Cameo

ఇక బాహుబలి, బాహుబలి 2 చిత్రాల తర్వార దర్శకధీరుడు రాజమౌళి నుంచి వచ్చిన ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విక్టరీ సాధించింది. అటు ఓవర్సీస్ లోనూ ఈ మూవీ దుమ్ముదులిపింది. ఇందులో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌ హీరోలుగా నటించారు. అంతేకాక ఈ సినిమాలో హాలీవుడ్ యాక్టర్స్ కూడా నటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+