మేం లేకపోతే నువ్ నథింగ్: స్టార్ హీరోపై అభిమానులు ఫైర్.. ఏం జరిగిందంటే..?
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చి కార్ రేసింగ్ లపైనే దృష్టి పెడుతున్నారు. తాజాగా యూకేలోని సిల్వర్ స్టోన్ లో జరిగిన మిషెలిన్ లే మాన్స్ కప్ కార్ రేసింగ్ లో పాల్గొన్నారు అజిత్. ఈ పోటీలకు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కూడా హాజరయ్యారు. అజిత్ ను ఆప్యాయంగా కౌగిలించుకున్నారు విజయ్. అంతేకాక ఒక క్యూట్ మినియేచర్ రేస్ కార్ ను గిఫ్ట్ గా అందించారు. దానిపై తమిళంలో "ప్రియముదన్ (ప్రేమతో) విజయ్.. నా లవ్లీ బ్రదర్ అజిత్ కు" అని స్పెషల్ గా రాసి సంతకం చేశారు. ఈ ఊహించని సర్ ప్రైజ్ గిఫ్ట్ చూసి అజిత్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అటు అజిత్ కూడా సీఎం విజయ్ కు ఓ గిఫ్ట్ ఇచ్చారు. ఒక రేసింగ్ హెల్మెట్ పై లవ్ అజిత్ అని రాసి విజయ్ కు బహుమతిగా ఇచ్చారు. ఇక వీరిద్దరి మధ్య స్పెషల్ బాండింగ్ చూసి చెన్నై నుంచి ఇంగ్లాండ్ వెళ్లిన అభిమానులు ఉత్సాహంతో ఊగిపోయారు.
అయితే ఈ కారు రేసింగ్ లో ఓ అభిమాని పట్ల అజిత్ వ్యవహరించిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అజిత్ ను ఏకిపారేస్తున్నారు. అభిమానులు లేనిది నువ్ లేవు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఏం జరిగిందంటే..? ఓ అభిమాని అజిత్ తో సెల్ఫీ కోసం తాపత్రయపడ్డాడు. అయితే దూరం నుంచే అభిమానిని చూసిన అజిత్ సీరియస్ అయ్యాడు. వెంటనే అక్కడే ఆగి చేతులను తొడల వద్ద పెట్టుకుని అభిమాని వైపు సీరియస్ లుక్ ఇచ్చాడు. దాంతో సదరు అభిమాని కూడా అజిత్ నుంచి దూరంగా వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

హీరో అజిత్ ప్రవర్తించిన తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. ఫ్యాన్స్ లేకపోతే నువ్ నథింగ్, అని ఒకరు కామెంట్ పెట్టారు. నీ సినిమాలను హిట్ చేసిన సాధారణ ఫ్యాన్స్ పై ఇలా ఆగ్రహం వ్యక్తం చేయొద్దని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. నవ్వడం వల్ల ఎలాంటి ఖర్చు లేదని మరొకరు కామెంట్ పెట్టారు. అయితే అజిత్ ఇప్పటివరకూ దీనిపై ఎలాంటి వివరణ ఇవ్వలేదని తెలుస్తోంది. ఇక అజిత్ గతంలో గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమాతో అలరించారు. ప్రస్తుతం డేర్ డెవిల్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. బ్రేవ్ హార్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని అజిత్ సతీమణి షాలిని అజిత్ కుమార్ నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ సెప్టెంబర్ చివరినాటికి ప్రారంభం కానుంది.












Click it and Unblock the Notifications
