సమంత, శోభితకు షాక్.. నాగచైతన్య పక్కన ఆమె ఎవరు?

అక్కినేని నాగేశ్వరరావు కుటుంబం నుంచి మూడోతరం కథానాయకుడిగా తెలుగు సినీ పరిశ్రమలోకి ప్రవేశించారు నాగచైతన్య. ప్రస్తుతం మిడ్ రేంజ్ హీరోగా కొనసాగుతున్నారు. సరైన బ్లాక్ బస్టర్ సినిమాలు రెండు పడితే స్టార్ కథానాయకుడిగా మారడానికి అవకాశం ఉంది. అందుకోసం ఆయన ఎంతో శ్రమిస్తున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతం తన కెరీర్ లో మొదటిసారిగా భారీ బడ్జెట్ తో తండేల్ సినిమా తెరకెక్కుతోంది. గీతా ఆర్ట్స్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకుడు. సాయిపల్లవి కథానాయికగా నటిస్తోంది.

తాజాగా మరో ప్రాజెక్టును చైతన్య సిద్ధం చేస్తున్నారు. గతేడాది దూత వెబ్ సిరీస్ తో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సిరీస్ బిగ్గెస్ట్ హిట్ అయి నాగచైతన్యకు ఎంతో ఊరటను కల్పించింది. ఈ సిరీస్ తోనే తొలిసారిగా ఓటీటీలోకి ప్రవేశించారు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో దూత వెబ్ సిరీస్ పార్ట్ 2 కూడా సిద్ధమవుతోంది. ఇందులో హీరోయిన్ గా డాక్టర్ పాపా.. యంగ్ ట్యాలెంటెడ్ బ్యూటీ కామాక్షి భాస్కర్ల ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. నాగచైతన్యతో కలిసి ఈ యాంగ్ డాక్టర్ రొమాన్స్ చేయబోతోంది.

akkineni nagachaitanya will act dhootha web series2

పొలిమేర, పొలిమేర 2, విరూపాక్ష లాంటి సినిమాలు తో కామాక్షి భారీ పాపులాటి దక్కించుకుంది. దాదా సాహెబ్ ఫిలిం ఫెస్టివల్ లో పొలిమేర 2 చిత్రంలో ఉత్తమ నటనకు అవార్డు గెలుచుకొని నెట్టింట ఈ అమ్మడు తెగ ట్రెండ్ అయ్యింది. దూత 2 వెబ్ సిరీస్ కథ చాలా భిన్నంగా ఉంటూనే.. రొమాంటిక్ సీన్స్ కి కూడా మంచి స్కోప్ ఉండేలా డైరెక్టర్ విక్రమ్ ప్లాన్ చేశారు. ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు. తండేల్ చిత్రం షూటింగ్ పూర్తయిన తర్వాత నాగచైతన్య దూత2లో పాల్గొనే అవకాశం ఉంది. తండేల్ తర్వాత చేయబోయే చిత్రానికి సంబంధించి ఇప్పటినుంచే కథలు వింటున్నారు. తండ్రి నాగార్జున మరో వివాహం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ కెరీర్ పైనే దృష్టి సారిస్తున్నాని నాగచైతన్య స్పష్టం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+