సమంతను ఫాలో అవుతున్న అక్కినేని కుటుంబ సభ్యులు
దక్షిణాది ముద్దుగుమ్మ సమంత ప్రస్తుతం సొంత బ్యానరులో ఓ సినిమాతోపాటు ఓ వెబ్ సిరీస్ చేస్తోంది. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో ప్రత్యేక గీతంలో నర్తించాలంటూ తారక్ కోరినట్లు వార్తలు వస్తున్నాయి. ఏమాయచేశావే సినిమా సమయం నుంచి.. ఆ తర్వాత నాగచైతన్యతో ప్రేమలో పడి ఇద్దరూ కొన్ని సంవత్సరాలు ప్రేమించుకొని, పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. టాలీవుడ్ లో చూడముచ్చటైన జంటగా పేరుతెచ్చుకున్న ఈ జంట నాలుగు సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత మనస్పర్థల వల్ల విడిపోతున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు.
సాయంత్రం ఆరుగంటలకు భోజనం
సమంత అక్కినేని వారి ఇంటి కోడలిగా వెళ్లక ముందు, వెళ్లిన తర్వాత డైట్ ను ఎంతో పర్ ఫెక్ట్ గా ఫాలో అయ్యేది. అంతేకాదు అక్కినేని కుటుంబ సభ్యుల డైట్ ను కూడా పూర్తిగా మార్చేసింది. ప్రతిరోజు.. ఏవారం ఏది తినాలి అనే విషయంలో ముందుగానే ఓ టైంటేబుల్ ను రాసిపెట్టేది. ప్రధానంగా రాత్రి డిన్నర్ ను సాయంత్రం ఆరుగంటల్లోపు పూర్తిచేయాలనే షరతు విధించింది. ఆ తర్వాత అందరూ వాకింగ్ చేయాలి. దాన్నే నాగార్జున, నాగచైతన్య, అమల, అఖిల్ ఫాలో అయ్యేవారు. అయితే నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత కూడా అక్కినేని కుటుంబ సభ్యులంతా ఇదే డైట్ ను ఫాలో అవుతున్నారు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరలవుతుండటంతో సమంత అభిమానులు విభిన్నంగా స్పందిస్తున్నారు.

దిశ మార్చుకున్న వివాదం
కొండా సురేఖ వివాదంలో అక్కినేని నాగార్జున ఆమెపై రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. నాంపల్లి కోర్టులో విచారణ జరుగుతోంది. వివాదం నేపథ్యంలో సురేఖ సమంతకు క్షమాపణ చెప్పింది. దీనిపై ఆమె ఎంతో హుందాగా వ్యవహరించింది. సురేఖ ప్రధాన లక్ష్యం కేటీఆర్ అయినప్పటికీ అనుకోకుండా అందరూ అనుకుంటున్నారంటూ నాగార్జున, నాగచైతన్య, సమంత పేర్లను బయటకు లాగడంతో వివాదం దిశ మార్చుకొని అక్కినేని కుటుంబంవైపు వెళ్లింది. దీంతో సినీ పరిశ్రమ మొత్తం నాగార్జునకు అండగా నిలబడ్డారు. దీన్ని ఇంతటితో వదిలేయాలంటూ కాంగ్రెస్ పార్టీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా పరిశ్రమకు విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications