ఆ హీరోయిన్ నా ప్రాపర్టీ... నాగార్జున వార్నింగ్?

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కింగ్ నాగార్జున రెండు సినిమాలు చేశారు. ఒకటి సూపర్, ఇంకోటి శివమణి. ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా ఘనవిజయం సాధించాయి. శివమణి సినిమాలో నాగార్జున ఆటిట్యూడ్ అందరికీ నచ్చింది. ప్రధానంగా నాగార్జున బాడీ లాంగ్వేజ్ కి అందరూ ఇంప్రెస్ అయ్యారు. సినిమాలో పూరి స్టైల్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఆసిన్, రక్షితల గ్లామర్ సినిమాకు మరో ప్లస్ అయ్యాయి.

శివమణి తర్వాత పూరీ జగన్నాథ్ మేకింగ్ నచ్చిన నాగార్జున సూపర్ సినిమా చేశారు. అనుష్క శెట్టి, ఆయేషా టకియా, సోనూసూద్ తెలుగు పరిశ్రమకు ఈ సినిమాద్వారానే పరిచయమయ్యారు. అనుష్క మొదటి సినిమా కాబట్టి షూటింగ్ సమయంలో బాగానే ఇబ్బంది పడింది. ఈ సినిమా తర్వాత మళ్ళీ ఇండస్ట్రీ వైపు రాకూడదని అనుకుందికానీ, ఆ సినిమాకు వచ్చిన రెస్పాన్స్, తనకొచ్చిన పాపులారిటీ చూసి ఆమెను మళ్ళీ వెనక్కి వెళ్ళనివ్వలేదు.

akkineni nagarjuna warning to comedian ali

అనుష్క ఇప్పటికీ తెలుగులో హీరోయిన్‌గా కొనసాగుతోంది. ఆయేషా టకియా నవ్వుకి నాగార్జున ఫ్లాటైపోయారంటూ ఆ సమయంలో వార్తలు వచ్చాయి. నవ్వినప్పుడు ముక్కు ఒకలాగా పెడుతుంది. అందరూ ఆమె నవ్వుకు ఇంప్రెస్ అయ్యారు. ఇదే విషయంలో కమెడియన్ అలీ నాగార్జున ముంద్ ఫన్నీగా కామెంట్ చేశాడు.

అందుకు అందరి ముందు నవ్వి ఊరుకున్న నాగార్జున ఆ తర్వాత మాత్రం అలీని హెచ్చరించారంట. అలీ కూడా సూపర్ సినిమాలో నటించాడు. ఆ చనువుతోనే సరదాగా కామెంట్స్ చేశాడు. నాగార్జున మాత్రం ఆయేషా నా ప్రాపర్టీ అన్నట్టుగా అలీకి వార్నింగ్ ఇచ్చాడంటూ పరిశ్రమలో గుసగుసలాడుకున్నారు. ప్రస్తుతం నాగార్జున నాసామిరంగా అనే చిత్రం చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+